క్రిష్‌ ను బాధ పెట్టిన ఆ వదంతులు

క్రిష్‌ ను బాధ పెట్టిన ఆ వదంతులు

బాలకృష్ణ, శ్రియ, హేమమాలిని ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పాత్రికేయులతో దర్శకుడు క్రిష్‌ కొద్దిసేపు ముచ్చటించారు. ‘

‘ఈ చిత్రాన్ని తీస్తున్నప్పుడు ఎలా వస్తుందోనని ఎక్కడా భయపడలేదు కానీ ఓ బా ధ్యతగా భావించాను. కథే ఈ చిత్ర కథానాయకుడ్ని ఎంపిక చేసుకుంది. ఈ చారిత్ర క కథ వినడానికి బాలకృష్ణగారు అమితాసక్తిని కనబరిచారు. ఇంకా చెప్పాలం టే…ఆకలిగా ఉన్న పులికి వేట దొరికినట్లుగా ఆయన ఫీలయ్యారు. గౌతమిగా తల్లి పాత్రలో హేమమాలిని, వశిష్టి పాత్రలో శ్రియ తమ పాత్రలకు ప్రాణప్రతిష్ట చేశారు. చారిత్రక కథావస్తువుగా తీసిన కంచె సినిమాలో జరిగిన లోటుపాట్లు ఏవై నా ఉంటే అవి మళ్లీ ఈ సినిమాలో జరగకుండా జాగ్రత్తపడ్డాం. కల్యాణదుర్గం, అమరావతి వంటి లొకేషన్లలో మూడు టీమ్‌లుగా ఏర్పడి ఈ చిత్రం చిత్రీకరణ చేశాం’’ అని చెప్పారు.

చిన్నప్పుడు శాతకర్ణి గురించి చదువుకునే ఉంటాం. కానీ ఆయన గురించి పూర్తిగా తెలియదు. రెండువేల సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర కథ. అందుకు సంబంధించిన వివరాలు అందుబాటులో తక్కువగా ఉన్నాయి. అందుకోసం ఎన్నో పుస్తకాలు చదివాం. సాధ్యమైనంతవరకు సమాచారాన్ని సేకరించి, ఎంతోమంది పరిశోధనాకారులతో మాట్లాడిన తర్వాతే స్క్రిప్ట్‌ వర్క్‌ మొదలుపెట్టాం. తెలిసిన సంఘటనలే తీసుకుని సినిమాగా మలిచే నేపథ్యంలో కల్పిత సన్నివేశాలు కూడా ఉంటాయి. అలాగని శాతకర్ణి కథను వక్రీకరించామని చెప్పలేం. అవసరమైన మేరకే కల్పితాలను మేళవించాం. 

బాజీరావు మస్తానీ సినిమా నుంచి కొన్ని సన్నివేశాలను డబ్బులిచ్చి తీసుకున్నామని వదంతులు వచ్చాయి. కానీ ఇలాంటి వదంతులు ఎక్కడ్నుంచి పుడతాయో అర్థం కాదు. ఎంతో కష్టపడి తీసిన సినిమాపై ఏవేవో వదంతులను సృష్టించడం సరికాదు. అలాంటివి విన్నప్పుడు నిజంగానే చాలా బాధేస్తుందని క్రిష్ ఆవేదన చెందారు. ఇలాంటి దుష్ప్రచారాలు ఎన్నున్నా విజయం తనకు ఆనందం కలిగిస్తుందని చెప్పారు.

బాలకృష్ణ వందో చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణితో దుమ్ము దులిపేసిన క్రిష్ మరో సీనియర్ హీరో ప్రతిష్ఠాత్మక చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు.  వెంకటేశ్ 75వ సినిమాకు తానే దర్శకత్వం వహించనున్నట్లు క్రిష్ చెప్పాడు. వెంకీ మూవీకి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్ల‌డిస్తాన‌ని చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు