చెన్నైలో ‘రెడ్ లైట్’ పై హాట్ చర్చ

చెన్నైలో ‘రెడ్ లైట్’ పై హాట్ చర్చ

కోలీవుడ్ లో ఒక సినిమాపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ సినిమా కాన్సెప్ట్ చూస్తే షాక్ తినాల్సిందే. మహానగరాల్లో రెడ్ లైట్ ఏరియా లాంటివి ఉంటుంటాయి. ముంబయి.. కోల్ కతా మహానగరాల్లో వేశ్యలకంటూ ప్రత్యేకమైన రెడ్ లైట్ ఏరియా ఉండటం తెలిసిందే.మరి.. అలాంటి ఏరియా చెన్నై మహానగరంలో ఉండాలిగా అన్న కాన్సెప్ట్ తో ఒక చిత్రం రావటం ఇప్పుడు హాట్ చర్చగా మారింది.

ఈ సినిమా అల్లాటప్పాదర్శకుడి నుంచిరావటం లేదు. ఇప్పటికే పలు జాతీయ.. అంతర్జాతీయ అవార్డుల్ని గెలుచుకున్న చిత్రాల్ని నిర్మించిన అనుభవం ఉన్న జే. సతీష్ కుమార్ ఈ సినిమాను తీస్తుండటంతో మరింత ఆసక్తి పెరిగింది. ‘శివప్పు ఎనక్కు పుడిక్కుం’ పేరిట తీస్తున్న ఈ సినిమా కథ గురించి చెబుతూ.. కాన్సెప్ట్ భిన్నమైనా.. అశ్లీలత ఎంత మాత్రం ఉండదని చెబుతున్నారు.

ఒకవేశ్య తన వద్దకు వచ్చే ఐదుగురి మనస్తత్వాల గురించి ఒక రచయితకు వివరించటమే ఈ సినిమా కథగా చెబుతున్నారు. మహానగరాలకు రెడ్ లైట్ ఏరియాలు అవసరమనే వివాదాస్పద లైన్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పుడు అందరి దృష్టి పడుతోంది. అయితే.. ఈ సినిమాలో ఎలాంటి అశ్లీల సన్నివేశాలు ఉండవని ఒకటికి నాలుగుసార్లు చెబుతున్నారు ఈ చిత్ర దర్శకుడు యురేక. మరీ.. సినిమా విడుదలయ్యాక ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు