గౌతమ్-విక్రమ్ టీజర్ అదిరిపోయిందిగా..

గౌతమ్-విక్రమ్ టీజర్ అదిరిపోయిందిగా..

గౌతమ్ మీనన్ మొన్నటిదాకా ధనుష్ సినిమా ‘ఎనై నోకి పాయుం తోటా’ అనే సినిమా పనిలో ఉన్నాడు. విక్రమ్ కూడా ‘ఇంకొక్కడు’ సినిమాను ముగించి ఈ మధ్యే ఫ్రీ అయ్యాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో ‘ధృవ నక్షత్రం’ పేరుతో సినిమా కన్ఫమ్ అయి ఎంతో కాలం కాలేదు. కానీ ఉన్నట్లుండి వరుసగా పోస్టర్లతో మోత మోగించాడు గౌతమ్ మీనన్.

అంతే కాదు.. ఇప్పుడు టీజర్ కూడా లాంచ్ చేసేశాడు. మనసుకు హత్తుకునే బ్యూటిఫుల్ లవ్ స్టోరీలు తీయడంతో ఎంత ప్రత్యేకత చూపిస్తాడో.. యాక్షన్ కాప్ స్టోరీస్ తీయడంలోనూ అంతే ప్రతిభ చూపిస్తాడు గౌతమ్. ఈసారి ఆయన తీస్తోంది ఒక కాప్ స్టోరీనే. కాకపోతే ఈసారి గౌతమ్ హీరో రెగ్యులర్ పోలీస్ కాదు. అండర్ కవర్ ఏజెంట్.

ఒక అండర్ కవర్ ఆపరేషన్ మీద న్యూయార్క్ చేరుకుని.. శత్రువుల కోసం వేట సాగించే బృందానికి లీడర్‌గా కనిపించబోతున్నాడు విక్రమ్. అతడి కదలికల్ని శత్రువుల బృందం పసిగడుతుంది. ఇతడి పై అధికారి ఒకరిని పట్టుకుని.. తన ద్వారా ఇతడిని.. ఇతడి బృందాన్ని మట్టుబెట్టాలని చూస్తుంది.

ఇక ఆ తర్వాత హీరో ఈ సమస్యను సాల్వ్ చేసి ఆపరేషన్ ఎలా పూర్తి చేశాడన్నది ‘ధృవ నక్షత్రం’ కథ. విజువల్స్.. విక్రమ్ లుక్.. మ్యూజిక్.. టెక్నికల్ వాల్యూస్.. ఇలా ఏది చూసినా హాలీవుడ్ సినిమాను తలపించేలా ఉంది ఈ టీజర్. రిలీజ్ డేట్‌కు కౌంట్ డౌన్ మొదలైందంటూ టీజర్లో చెప్పడం ద్వారా సమ్మర్లోనే సినిమా రిలీజైపోతుందని హింట్ ఇచ్చారు. ఈ సినిమా తెలుగులోనూ ఒకేసారి విడుదలవుతుంది.

Click Here For The Video

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు