అలా చేస్తే.. ఓవర్ సీస్ వసూళ్లు కుమ్ముడేనట

అలా చేస్తే.. ఓవర్ సీస్ వసూళ్లు కుమ్ముడేనట

మొన్నటి వరకూ లైట్ తీసుకున్న ఓవర్ సీస్ రైట్స్ ఇప్పుడు సినిమాకు ఎంతో కీలకమయ్యాయి. సంక్రాంతి బరిలో నిలిచిన ఖైదీ.. శాతకర్ణి సినిమాలకు వచ్చిన ఓవర్ సీస్ వసూళ్లతో దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే పరిస్థితి. బాలకృష్ణ వరకూ చూస్తే.. ఆయన కెరీర్ మొత్తంలోనే శాతకర్ణి ఓవర్ సీస్ వసూళ్లు చాలా.. చాలా ఎక్కువ. ఆ మాటకు వస్తే.. గతంలో ఆయన సినిమాలకు జరిగిన ఓవర్ సీస్ బిజినెస్ కు.. శాతకర్ణికి సంబంధం లేదని చెబుతారు. అందుకు తగ్గట్లే వసూళ్లు కూడా ఉన్నాయన్నది తెలిసిందే.

శాతకర్ణిని పక్కన పెడితే.. ఖైదీ వసూళ్ల లెక్క విని మెగా ఫ్యామిలీనే షాక్ తిన్నారట. తాము కలలో కూడా ఊహించని రీతిలో ప్రీమియర్ షోలకే మిలియన్ డాలర్ల కలెక్షన్ల వర్షం కురవటం వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇదిలా ఉంటే.. ఓవర్ సీస్ వసూళ్ల గురించి అక్కడి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న కొందరితో ప్రత్యేకంగా మాట్లాడినప్పుడు ఆసక్తికర అంశాలు చెప్పుకొచ్చారు.

ఇప్పుడు వచ్చిన వసూళ్లకే ఆశ్చర్యపోతున్నారు కానీ.. నిజానికి తెలుగు సినిమాకు ఉన్న అవకాశాలు మరింత ఎక్కువని చెబుతున్నారు. రిలీజ్ డేట్స్ ను మూడు వారాలు.. నెల రోజుల ముందే ప్రకటించటం వల్ల ఈ వసూళ్లు వచ్చాయని.. అదే.. సినిమా షూటింగ్ మొదలయ్యేటప్పుడే రిలీజ్ డేట్ ను కానీ సెట్ చేస్తే.. మరింత భారీగా కలెక్షన్లు పెరిగే వీలుందని చెబుతున్నారు.

సాధారణంగా హాలీవుడ్ సినిమాలు కానీ.. ఈ మధ్యన బాలీవుడ్ సినిమాలన్నీ షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తున్నాయి. దీని వల్ల.. సినిమా రేంజ్ ను అనుసరించి.. దానికి ఉండే క్రేజ్ కు తగ్గట్లుగా థియేటర్లను బుక్ చేసుకునే వీలు ఉంటుంది. అయితే.. టాలీవుడ్ లో ఇప్పుడు అనుసరిస్తున్న విధానం వల్ల.. అవసరమైన థియేటర్లు దొరకని పరిస్థితి.

తాజాగా ఖైదీ.. శాతకర్ణి సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో జరిగిందిదే. ఇప్పుడొచ్చిన కలెక్షన్లకు వావ్ అనుకుంటున్నారుకానీ.. నిజానికి ముందే కానీ ఈ సినిమా రిలీజ్ డేట్స్ ను అనౌన్స్ చేసి ఉంటే.. మరింత ఎక్కువగా కలెక్షన్లు ఉండేవట.  తక్కువ సమయం ఉండటంతో థియేటర్లను బుక్ చేసుకునే విషయంలో ఇబ్బందులు ఎదురైనట్లు తెలుస్తోంది.

ఖైదీ.. శాతకర్ణిల రిలీజ్ ఎప్పుడన్న దాని మీద చాలానే సస్పెన్స్ నడిచింది. చాలా తక్కువ వ్యవధిలో డేట్స్ ను అనౌన్స్ చేశారు. దీంతో ఓవర్ సీస్ లో ఉన్న వాస్తవ డిమాండ్ కు తగినన్ని షోలు వేయలేని పరిస్థితి. అదేకానీ.. మరింత ముందే రిలీజ్ డేట్ కానీ అనౌన్స్ చేసి ఉంటే.. కలెక్షన్లు మరింత భారీగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. రిలీజ్ డేట్స్ ను ప్రకటించే విషయంలో ఇప్పుడున్న మైండ్ సెట్ ను టాలీవుడ్ నిర్మాతలు కానీ మార్చుకుంటే.. ఓవర్ సీస్ వసూళ్లు కుమ్ముడేనట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English