చరణ్ కొట్టాడు.. ఇక బాలయ్యే

చరణ్ కొట్టాడు.. ఇక బాలయ్యే

అమెరికాలో మిలియన్ డాలర్ క్లబ్.. టాలీవుడ్లో స్టార్ హీరోల స్టామినాకు ఒక కొలమానం. అది సాధిస్తేనే స్టార్ స్టేటస్ కు ఒక వాల్యూ. అందుకే సాధ్యమైనంత త్వరగా ఆ క్లబ్బులో చేరడానికి తహతహలాడుతుంటారు స్టార్ హీరోలు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ క్లబ్బులో చేరడానికి గత కొన్నేళ్లలో గట్టి ప్రయత్నమే చేశాడు.

కానీ కుదర్లేదు. ఐతే ఎట్టకేలకు ఈ ఏడాది 'ధృవ' తో తన కలను నెరవేర్చుకున్నాడు. ఈ సినిమా మిలియన్ క్లబ్బును అందుకోవడమే కాదు.. 1.5 మిలియన్ క్లబ్బును కూడా టచ్ చేసి రామ్ చరణ్‌ను సంతోషంలో ముంచెత్తింది. ఇప్పుడు నందమూరి బాలకృష్ణను కూడా మిలియన్ క్లబ్బు ఊరిస్తోంది.

ఇప్పటిదాకా బాలయ్య కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన 'లెజెండ్' సినిమా కూడా అమెరికాలో హాఫ్ మిలియన్ మార్కును కూడా టచ్ చేయలేదు. ఆ సినిమా 4.1 లక్షల డాలర్లు మాత్రమే వసూలు చేసింది. గత ఏడాది 'డిక్టేటర్' అమెరికాలో దారుణమైన ఫలితాన్ని చవిచూసింది. ఐతే ఇప్పుడు 'గౌతమీపుత్ర శాతకర్ణి' మాత్రం అక్కడ అదరగొడుతోంది.

ప్రిమియర్లతోనే 3.7 లక్షల డాలర్లు వసూలు చేసిన ఈ చిత్రం ఆల్రెడీ హాఫ్ మిలియన్ మార్కును అందుకుంది. లాంగ్ వీకెండ్ అడ్వాంటేజీని ఉపయోగించుకుని ఈ చిత్రం సులువుగానే మిలియన్ మార్కును టచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. టాక్ బాగుంది.. కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి కాబట్టి బాలయ్య కూడా మిలియన్ కల నెరవేర్చుకోబోతున్నట్లే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు