సోదిలో కూడా లేని సూపర్‌స్టార్‌ మూవీ

సోదిలో కూడా లేని సూపర్‌స్టార్‌ మూవీ

అమీర్‌ఖాన్‌ బాక్సాఫీస్‌ వద్ద చేసిన విధ్వంసంతో 'రయీస్‌' మేకర్స్‌ నీరసించిపోయారేమో అనిపిస్తోంది. షారుక్‌ ఖాన్‌ చిత్రానికి మొదట్లో బజ్‌ బాగానే వచ్చింది కానీ గత రెండు వారాలుగా అసలు ఇది సోదిలో కూడా లేకుండా పోయింది. సల్మాన్‌, అమీర్‌ఖాన్‌ బాక్సాఫీస్‌ సుల్తాన్‌లుగా అవతరించిన టైమ్‌లో షారుక్‌ విచిత్రమైన ఛాయిస్‌లతో ఇంకా ఇంకా వెనకబడిపోతున్నాడు.

షారుక్‌కి సోలో రిలీజ్‌ కూడా దక్కడం లేదు. గత క్రిస్మస్‌కి దిల్‌వాలేకి బాజీరావు మస్తానీతో పోటీ పడింది. రయీస్‌ రిలీజ్‌ అవుతున్న రోజే హృతిక్‌ కాబిల్‌ వస్తోంది. హృతిక్‌ అంధుడిగా నటిస్తోన్న ఈ చిత్రం అందరిలోను ఆసక్తి రేకెత్తిస్తోంది. షారుక్‌ రయీస్‌లో అలాంటి ఆకర్షణలు కొరవడడం, సడన్‌గా ప్రమోషన్స్‌లోను స్తబ్ధత రావడంతో మళ్లీ సూపర్‌స్టార్‌కి పరాభవం తప్పదేమో అనిపిస్తోంది.

 మామూలుగా ఏ సినిమాకి అయినా పబ్లిసిటీ పరంగా అగ్రెసివ్‌గా వుండే షారుక్‌ ఈ చిత్రానికి ఎందుకో ముందే చేతులెత్తేసిన ఫీలింగ్‌ వస్తోంది. తన స్థానాన్ని మరొకరు తీసుకుంటే ఈగో ఫీలయ్యే షారుక్‌ని 'దంగల్‌' నిజంగానే డిప్రెషన్‌లోకి నెట్టేసిందా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. మళ్లీ ఇప్పుడో భారీ బ్లాక్‌బస్టర్‌ వస్తే తప్ప షారుక్‌ ఖాన్‌ కాన్ఫిడెన్స్‌ రీస్టోర్‌ అయ్యేలా లేదు. రయీస్‌ కనుక పొరపాట్న డిజాస్టర్‌ అయితే షారుక్‌ కాన్ఫిడెన్స్‌తో పాటు మార్కెట్‌ కూడా దారుణంగా పడిపోతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు