‘అఆ’ భామ ఊపు మామూలుగా లేదు

‘అఆ’ భామ ఊపు మామూలుగా లేదు

‘అఆ’ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ది అంత ప్రత్యేకమైన పాత్రేమీ కాదు. అలాగే ‘ప్రేమమ్’ సినిమాలో కూడా ఆమెది చిన్న పాత్రే. అయినప్పటికీ ఈ మలయాళ కుట్టి తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. అనుపమ చేసిన తొలి రెండు సినిమాలూ హిట్టయిపోవడంతో లక్కీ గర్ల్ అని పేరు తెచ్చేసుకుంది అనుపమ.

సంక్రాంతికి రాబోయే అనుపమ కొత్త సినిమా ‘శతమానం భవతి’ మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాతో ఆమె హ్యాట్రిక్ కొట్టేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ఊపులో ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చి పడుతున్నాయి.

ఈ మధ్యే రామ్ చరణ్-సుకుమార్ సినిమాలో ఓ కీలక పాత్రకు అనుపమ ఎంపికనట్లుగా వార్తలొచ్చాయి. ఇంతలోనే అనుపమకు మరో మంచి అవకాశం లభించింది. నేచురల్ స్టార్ నాని సరసన ఆమె నటించబోతున్నట్లు సమాచారం. ‘నేను లోకల్’ తర్వాత ‘ఓ మై ఫ్రెండ్’ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నటించనున్నాడు నాని. దిల్ రాజు ఆ చిత్రాన్ని నిర్మిస్తాడు. ‘శతమానం భవతి’లో అనుపమ టాలెంట్ చూసి ఫిదా అయిపోయిన రాజు.. ఆమెకు తన బేనర్లో ఇంకో అవకాశం కట్టబెట్టేశాడట.

 మరోవైపు రవితేజ చేయబోయే కొత్త సినిమాలోనూ అనుపమే కథానాయిక అంటున్నారు. మొత్తానికి ఒకప్పటి స్టార్ హీరోయిన్లంతా జోరు తగ్గించేస్తున్న టైంలో అనుపమ బాగానే స్పీడు చూపిస్తోంది. త్వరలోనే ఈ అమ్మాయి స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించేస్తుందేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు