రామ్ చరణ్ కు ఆమె బిగ్గెస్ట్ క్రిటిక్

రామ్ చరణ్ కు ఆమె బిగ్గెస్ట్ క్రిటిక్

తన సినిమాలకు సంబంధించి ఎవరో బయటి వాళ్లు సమీక్షలు ఇవ్వాల్సిన పని లేదంటున్నాడు రామ్ చరణ్. తన ఇంట్లోనే పెద్ద క్రిటిక్ ఉన్నారని.. ఆ క్రిటిక్ అభిప్రాయాన్ని బట్టి తన సినిమాల్లో తప్పొప్పులు తెలుసుకుంటానని చెబుతున్నాడు చరణ్. ఇంతకీ చరణ్ చెబుతున్న ఆ పెద్ద క్రిటిక్ ఎవరు అంటే.. అతడి భార్య ఉపాసనే. తన భార్యే తనకు బిగ్గెస్ట్ క్రిటిక్ అని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు చరణ్.

''మామూలుగా నేనో సినిమా ఒప్పుకునే ముందు ఉపాసనతో ఏమీ డిస్కస్ చేయను. ఎలాంటి సినిమాలు ఎంచుకోవాలో ఆమె నాకేమీ సలహాలు ఇవ్వదు. కానీ నేను చేసిన సినిమాల గురించి మాత్రం బాగా అనలైజ్ చేస్తుంది. నా బిగ్గెస్ట్ క్రిటిక్ ఉపాసనే. ఇంట్లో సినిమాల గురించి.. నా షూటింగ్ విషయాల గురించి మాట్లాడేది తక్కువే. ఐతే నా సినిమాలు వచ్చినపుడు చూసి తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెబుతుంది. ఆమె అభిప్రాయం వినడానికి ఆసక్తిగా ఎదురు చూస్తుంటా'' అని చరణ్ చెప్పాడు.

ఇక తన తండ్రి.. బాబాయిలతో కలిసి ఒకే సినిమాలో నటించడం కోసం తాను చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని రామ్ చరణ్ చెప్పాడు. సరైన స్క్రిప్టు కోసం ఎదురు చూస్తున్నామని.. అలాంటిది దొరికితే మరో ఆలోచన లేకుండా ఆ చేస్తామని చరణ్ చెప్పాడు. తన లేటెస్ట్ మూవీ 'ధృవ' రిజల్ట్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నానని.. ఇలాంటి సినిమాలు మరిన్ని చేయాలని ఉందని చరణ్ తెలిపాడు. సుకుమార్ దర్శకత్వంలో చరణ్ తన తర్వాతి సినిమాను చేయనున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు