రిజల్ట్‌తో పని లేదు, చిరంజీవి సక్సెస్‌

రిజల్ట్‌తో పని లేదు, చిరంజీవి సక్సెస్‌

ఖైదీ నంబర్‌ 150 చిత్రం రిజల్ట్‌ ఏదైనా కావచ్చు. సినిమా బాగుంటే హిట్టవుతుంది, బాగోలేదంటే ఫ్లాపవుతుంది. దాన్నెవరూ మార్చలేరు. అయితే ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తోన్న చిరంజీవి మాత్రం విమర్శకుల మతులు పోగొట్టే సమాధానాన్ని ఆల్రెడీ ఇచ్చేసారు. పాలిటిక్స్‌లో ఫెయిలై వస్తోన్న చిరంజీవిని మళ్లీ తెరపై ఎవరు చూస్తారంటూ, ఆయన సీనియర్‌ హీరోలతో పోటీ పడాల్సిందే తప్ప యువతరం దగ్గర్లోకి కూడా రాలేడని అన్నారు.

ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ పరంగా బాహుబలి తప్ప మిగిలిన అన్ని చిత్రాల కంటే అత్యధిక బిజినెస్‌ దీనికే జరిగింది. అలాగే అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ట్రెండ్‌ చూసినా, ఫిక్స్‌డ్‌ హైర్స్‌ గురించి వింటున్నా బాహుబలి తొలి రోజు రికార్డు బద్దలైపోవడం ఖాయంగా కనిపిస్తోంది. చిరంజీవి మళ్లీ నటిస్తే కనీసం చెప్పుకోతగ్గ ఓపెనింగ్‌ వస్తుందా అనుకున్న వాళ్లే మాట పెగలక మూగబోయారు.

ప్రతి ఏరియాలో ఎన్నెన్నో బెనిఫిట్‌ షోలు ప్లాన్‌ చేస్తే టికెట్స్‌ హాట్‌ కేకుల్లా సేల్‌ అయిపోతుంటే మరిన్ని షోలు యాడ్‌ చేసుకుంటున్నారు. కేవలం అభిమానులు మాత్రమే ఎగబడితే ఈ లెవల్‌ హంగామా వుండదు. చిరంజీవిని మళ్లీ తెరపై చూడ్డానికి అందరూ పోటీ పడుతున్నారు కనుకే ఈ చిత్రానికి క్రేజ్‌ ఈ లెవల్లో వుంది. ఈ చిత్రం రిజల్ట్‌ ఏదైనా కానీ చిరంజీవి మేనియా అయితే మళ్లీ అదే స్థాయిలో తిరిగొచ్చేసింది. ఇక అది ప్రతి సినిమాకీ కంటిన్యూ అవుతుందనే దాంట్లో అనుమానాలే అక్కర్లేరిక.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు