మెగా బీటింగ్‌ - చిరంజీవా మజాకా?

మెగా బీటింగ్‌ - చిరంజీవా మజాకా?

'ఖైదీ నంబర్‌ 150' క్రేజ్‌ చూస్తోంటే దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తోంది ట్రేడ్‌ వర్గాలకి. తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ తెర మీదకి వస్తోన్న చిరంజీవి సినిమా కోసం జనాలు ఎగబడిపోతున్నారు. డిమాండ్‌ని క్యాష్‌ చేసుకోవడానికి బయ్యర్లు ఎన్ని షోలు కుదిరితే అన్ని షోలు తొలి రోజే కుమ్మి పారేస్తున్నారు.

జనవరి 12న 'శాతకర్ణి', 14న 'శతమానం' రిలీజవుతున్నాయని మొదటి రోజు అందుబాటులో ఉన్న థియేటర్లన్నీ వాడేసుకుంటున్నారు. మల్టీప్లెక్సుల్లో కూడా తొలి రోజు షో కౌంట్‌ చూస్తే షాక్‌ అయిపోతారు. విజయవాడలో మల్టీప్టెక్సుల్లో రోజుకి 135 షోలు వేస్తారు. జనవరి 11న 135 షోలు 'ఖైదీ నం. 150'నే ప్రదర్శిస్తున్నారు.

హైదరాబాద్‌లో కూడా పరిస్థితి అలాగే వుంది. ప్రసాద్‌ ఐమ్యాక్స్‌లో తొలి రోజున 33 షోలు, ఇనార్బిట్‌లో 23 షోలు, సుజనా ఫోరమ్‌ మాల్‌లో 34 షోలు, బంజారా హిల్స్‌ పీవీఆర్‌లో 13 షోలు, మంజీరా మాల్‌లో 17 షోలు, అత్తాపూర్‌లో 19 షోలు ఇలా ఎటు చూసినా ఖైదీ షోస్‌తో హోరెత్తిపోతోంది. ఇన్ని షోస్‌ ప్రదర్శించడం ఒకెత్తు అయితే అన్ని షోలు వున్నా ప్రైమ్‌ షోస్‌కి టికెట్స్‌ దొరకని పరిస్థితి వుంది. చాలా థియేటర్లలో అన్ని షోలు క్షణాల్లో ఫుల్‌ అయిపోయాయి. మెగాస్టారా మజాకానా మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English