వారెవ్వా చరణ్‌ ఇరగదీసాడుగా!

వారెవ్వా చరణ్‌ ఇరగదీసాడుగా!

రామ్‌ చరణ్‌ ప్రస్తుతం గడ్డం పెంచుతూ, కాస్త లీన్‌గా తయారయ్యే పనిలో ఉన్నాడు. సుకుమార్‌ సినిమాలోని పాత్ర కోసమని చరణ్‌ గెటప్‌ మారుస్తున్నాడు. ఫైనల్‌గా ఓకే అయ్యే లుక్‌ ఏమిటనేది ఇంకా తెలియదు కానీ ప్రస్తుతం చరణ్‌ లుక్స్‌ అదిరిపోయాయి. 'ఖైదీ నం. 150' సభలో చరణ్‌ లుక్స్‌ చూసి అభిమానులు పరవశించిపోతున్నారు.

ధృవలోనే చరణ్‌ తన కెరియర్‌ బెస్ట్‌ అనిపించాడంటే, ఇప్పటి లుక్‌ అంతకు మించి ఉందని చెప్పుకుంటున్నారు. గుబురు మీసాలు, గడ్డంతో చరణ్‌ మెచ్యూర్డ్‌గా కనిపించడంతో పాటు చాలా పవర్‌ఫుల్‌గానూ అనిపిస్తున్నాడు. సుకుమార్‌ ఇదే లుక్‌ ఫైనలైజ్‌ చేసేస్తే బాగుంటుందని ఫాన్స్‌ అభిప్రాయపడుతున్నారు.

ఒకప్పుడు చరణ్‌ లుక్స్‌ గురించి కామెంట్‌ చేసిన వారు సైతం ఇప్పుడు అతడిని టాలీవుడ్‌ హాండ్‌సమ్‌ హీరోల్లో ఒకడిగా పరిగణిస్తున్నారు. సుకుమార్‌ సినిమాలో పల్లెటూరి యువకుడిగా, వినికిడి లోపమున్న ఆవేశపరుడిగా చరణ్‌ కనిపిస్తాడనే ప్రచారం జరుగుతోంది. చరణ్‌ సినిమాల్లోనే ఇది అత్యంత వైవిధ్యమైనదని, నటుడిగా అతడిని ఎన్నో మెట్లు ఎక్కిస్తుందని ఇండస్ట్రీ టాక్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు