నాగబాబు దెబ్బకి రాం.గో.వర్మ గిల గిల

నాగబాబు దెబ్బకి రాం.గో.వర్మ గిల గిల

'పనికిమాలిన సన్నాసి', 'అక్కు పక్షి'... పేరు చెప్పి తిట్టకపోయినా, నాగబాబు ఈ మాటలన్నది రాంగోపాల్వర్మని అనే సంగతి ఇట్టే తెలిసిపోయింది. ట్విట్టర్లో కూర్చుని ఎంతో మందిని ప్రవోక్ చేస్తూ ట్వీట్లు వేస్తుండే వర్మని అందరూ ఇగ్నోర్ చేస్తుంటారు. అతడిని కదిపితే మళ్లీ రివర్స్లో ఇంకాస్త ఎక్కువ గోల చేస్తాడని. కానీ నాగబాబుకి ఓపిక నశించినట్టుంది.

అదే పనిగా చిరంజీవిని అకారణంగా టార్గెట్ చేస్తూ, ప్రతి చిన్న విషయానికీ ఆయనని చిన్నబుచ్చుతోన్న వర్మకి చురకలు వేయడానికి వేలాది మంది హాజరైన వేదికని ఎంచుకున్నాడు. అంత మందిలో వర్మని పట్టుకుని ఆ రేంజ్లో కడిగి పారేసే సరికి దానికి ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో అంత గొప్ప దర్శకుడికీ బోధ పడినట్టు లేదు.

ముందుగా క్షమాపణలు చెప్పేసి, ఓ గంటాగి మళ్లీ వచ్చి నాగబాబు మీద ఎటాక్ మొదలు పెట్టాడు. ఇంతవరకు వర్మ చాలా విషయాలపై చాలా ట్వీట్లు వేసాడు కానీ ఎప్పుడూ ఏ మేటర్లోను ఇన్ని ట్వీట్లు వేసి ఎరుగడు. అతని ట్వీట్ల సంఖ్య చూస్తేనే నాగబాబు దెబ్బ గట్టిగా తగిలిందనే సంగతి తెలిసిపోతోంది. పైకి నాగబాబుకి రివర్స్ వడ్డింపు ఇచ్చేస్తున్నాననే బింకం ఆ ట్వీట్లలో కనిపించినప్పటికీ తనని అంత మందిలో పట్టుకుని తూలనాడాడనే అక్కసు బాగానే ధ్వనించింది.

చివరకు చిరంజీవికి గుడ్నైట్ చెబుతూ ట్వీట్ల దండకానికి ఫుల్స్టాప్ పెట్టినప్పటికీ ఇది ఇంతటితో ఆపేస్తాడని అనుకోవడానికి లేదు. వర్మని చాలా మంది తిడుతుంటారు కానీ ఇలా లక్షల మంది వీక్షిస్తోన్న వేదికనెక్కి మీడియా సమక్షంలో ఈ రేంజ్లో కడిగేసిన వారెవరూ లేరు. సో, వర్మనుంచి ఈమాత్రం రియాక్షన్ రీజనబులేలెండి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు