నేనెప్పటికీ హీరోనే... అందులో తిరుగులేదు

నేనెప్పటికీ హీరోనే... అందులో తిరుగులేదు

'టెంపర్‌' సినిమాలో పోసాని కృష్ణమురళి చేసిన సిన్సియర్‌ కానిస్టేబుల్‌ ఆర్‌. నారాయణమూర్తి క్యారెక్టర్‌ గుర్తుందిగా? ఆ పాత్రని పూరి జగన్నాథ్‌ 'ఆర్‌. నారాయణమూర్తి'ని దృష్టిలో ఉంచుకునే రాసాడట. ఆ పాత్ర పోసాని రక్తి కట్టించినప్పటికీ నిజంగా నారాయణమూర్తి చేసి ఉంటే అది మరింత పేలి ఉండేదనేది ఒప్పుకుని తీరాలి.

ఆ కథ విన్నాక కూడా ఆర్‌. నారాయణమూర్తి రిజెక్ట్‌ చేసాడు. దానికి కారణమేంటో ఇంతవరకు పూరీ కానీ, ఆయన కానీ చెప్పలేదు. ఫైనల్‌గా నారాయణమూర్తి పెదవి విప్పాడు. అది సపోర్టింగ్‌ క్యారెక్టర్‌ కాబట్టి చేయలేదని, తాను చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ హీరోగా ఎదిగానని, ఇప్పుడు మళ్లీ సపోర్టింగ్‌ రోల్స్‌ వేస్తూ వెనక్కి ఎందుకు వెళతానని అడిగాడు.

నటించినంత కాలం హీరోగానే నటిస్తాను తప్ప సహాయక పాత్రలు మాత్రం చేయనని ఆయన స్పష్టం చేసాడు. తను నమ్మిన సిద్ధాంతాలకి కట్టుబడి ఉండే నారాయణమూర్తి ఈ నిర్ణయం మార్చుకుంటారని అనుకోలేం. ఇదిలావుంటే సంక్రాంతికి ఆయన హీరోగా నటించిన 'హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకట్రామయ్య' సినిమా విడుదలకి సిద్ధమవుతోంది. కానీ ఆ పోటీలో తన సినిమాకి ఒక్క థియేటర్‌ కూడా దొరకడం లేదని పీపుల్స్‌స్టార్‌ ఆవేదన వ్యక్తం చేసారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు