'ఖుషి' చూసి చిరు ఎంతగా పొంగిపోయాడంటే..

'ఖుషి' చూసి చిరు ఎంతగా పొంగిపోయాడంటే..

వీలైతే క‌లిపే ప్ర‌య‌త్నం చేద్దాం.. విడ‌గొట్ట‌డానికి కాదంటూ టాలీవుడ్ సీనియ‌ర్ ద‌ర్శక నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ గ‌ట్టిగా వాయించేశారు. మెగా బ్ర‌ద‌ర్స్ చిరంజీవి.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ధ్య దూరం పెంచేందుకు ప్ర‌య‌త్నించే మీడియా.. అభిమానుల‌పై ఆయ‌న ఫైర్ అయ్యారు.

ఒక వ‌య‌సు వ‌చ్చాక వ్య‌క్తుల్లో ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉండటం.. అభిప్రాయ భేదాలు త‌లెత్త‌డం స‌హ‌జ‌మ‌ని.. దాన్ని ప‌ట్టుకుని వ్య‌క్తుల మ‌ధ్య దూరం పెంచ‌డాన‌కిఇ ప్ర‌య‌త్నించ‌డం స‌రికాద‌ని ఆయ‌న అన్నారు. చిరు-ప‌వ‌న్ మ‌ధ్య ఎంత‌టి అనుబంధం ఉందో త‌న‌కు తెలుసంటూ ఆయ‌న కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పారు.

చిరంజీవి టాలీవుడ్లో నెం.1 నుంచి నెం.10 వ‌ర‌కు స్థానాల్ని ఆక్ర‌మించిన రోజుల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ 'ఖుషి' సినిమాతో త‌న స్టామినా చూపించాడ‌ని.. అది చూసి చిరు ఎంత సంతోషించాడో త‌న‌కు తెలుస‌ని.. త‌మ్ముడి ఘ‌న‌త గురించి త‌మ లాంటి వాళ్ల ద‌గ్గ‌ర చెప్పుకుని పొంగిపోయాడ‌ని.. ఆ సినిమాలో ఫైట్ల విష‌యంలో ప‌వ‌న్ చూపించిన క్రియేటివిటీకి ముచ్చ‌ట‌ప‌డి త‌న 'డాడీ' సినిమాకు కూడా ఫైట్ కంపోజ్ చేయించుకున్నాడ‌ని వెల్లడించారు.

చిరు-ప‌వ‌న్‌ల‌లో ఒక‌రంటే ఒక‌రికి అమిత‌మైన ప్రేమ ఉంద‌ని.. రాజ‌కీయ భావ‌జాలం వేరుగా ఉండ‌టం వ‌ల్ల కొంచెం దూరం పెరిగి ఉండొచ్చ‌ని అంత‌మాత్రాన వారి అభిప్రాయాల్ని ప్ర‌శ్నించే హ‌క్కు ఎవ‌రికీ లేద‌ని త‌మ్మారెడ్డి అన్నారు. కుదిరితే వీళ్ల‌ను క‌లిపే ప్ర‌య‌త్నాలు చెయ్యాలి త‌ప్ప.. విడ‌గొట్టాల‌ని కాద‌న్నారు. ఈ విష‌యంలో మీడియా తీరును ఆయ‌న దుయ్య‌బ‌ట్టారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ మెగా హీరోలకు సంబంధించిన వేడుక‌ల్లో నినాదాలు చేయ‌డాన్ని కూడా ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English