చిరు దిగే ముందు చరణ్‌ లాస్ట్‌ పంచ్‌

చిరు దిగే ముందు చరణ్‌ లాస్ట్‌ పంచ్‌

బుధవారం నుంచి సంక్రాంతి సినిమాల సందడి షురూ అవుతుంది కనుక ఈవారంలో ఒక్క చెప్పుకోతగ్గ సినిమా కూడా విడుదల కాలేదు. దీంతో సంక్రాంతి సినిమాలు వచ్చి థియేటర్లన్నీ హైజాక్‌ చేసేలోగా ఒక వీకెండ్‌ని క్యాష్‌ చేసుకునే అవకాశం మార్కెట్లో ఉన్న సినిమాలన్నిటికీ వచ్చింది.

ఈ అవకాశాన్ని ధృవ పూర్తి స్థాయిలో క్యాష్‌ చేసుకోవడానికి చూస్తోంది. ముఖ్యంగా యుఎస్‌లో ఈ చిత్రాన్ని థియేటర్ల నుంచి తీసేసే ముందు ఒక్క లాస్ట్‌ పంచ్‌ గట్టిగా వెయ్యాలని ఫిక్స్‌ అయ్యారు. గత వారంలో కేవలం పదిహేను థియేటర్లలో ప్రదర్శితమైన ధృవ ఈ వీకెండ్‌లో వందకి పైగా స్క్రీన్లలో ప్రదర్శితం కానుంది.

ఒకటిన్నర మిలియన్‌ డాలర్ల కలెక్షన్‌కి కేవలం కొన్ని వేల డాలర్ల దూరంలో ఉన్న ధృవ ఈ శని, ఆదివారాలతో ఆ లాంఛనం పూర్తి చేసుకోవడం ఖాయమని ఓవర్సీస్‌ ట్రేడ్‌ సోర్సెస్‌ చెబుతున్నాయి. తక్కువ స్క్రీన్లలో కూడా యావరేజ్‌ కలెక్షన్‌ బాగానే ఉండడంతో ఖచ్చితంగా ఈ వీకెండ్‌ కూడా ధృవకి ప్లస్‌ అవుతుందని అంటున్నారు.

మగధీర తర్వాత ఇక్కడ చాలానే హిట్లు కొట్టిన చరణ్‌కి ఓవర్సీస్‌లో మాత్రం ఏదీ కలిసి రాలేదు. ఏడేళ్లకి పైగా గ్యాప్‌ తర్వాత మళ్లీ ఓవర్సీస్‌లో సత్తా చాటుకున్న చరణ్‌కి రైట్‌ టైమ్‌లో ఈ మార్కెట్‌ ఓపెన్‌ అయింది. ఎందుకంటే అతని మలి చిత్రానికి సుకుమార్‌ డైరెక్టర్‌. సుక్కూ మార్కంటే యుఎస్‌లో డాలర్ల మోతే, దానికి తోడు చరణ్‌ ధృవ ఇమేజ్‌ బోనస్‌గా తోడయి, ఆ చిత్రానికి కూడా డాలర్ల వర్షం ఖాయంగా కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు