చిరంజీవిని వాడుకుని పగ తీర్చుకున్నాడా?

చిరంజీవిని వాడుకుని పగ తీర్చుకున్నాడా?

లెంగ్త్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా సందర్భాల్లో సీన్లు తొలగిస్తుంటారు. ఆ ప్రాసెస్‌లో కొంతమంది నటులు చేసిన మంచి సీన్లు కూడా ఎడిట్ అయిపోతుంటాయి. ఒక్కోసారి లక్షల కొద్దీ పారితోషికం ఇచ్చి తెచ్చుకున్న నటుల సీన్లని కూడా నిర్మాతలు త్యాగం చేస్తుంటారు.

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో బ్రహ్మానందం ట్రాక్ పూర్తిగా ఎడిటింగ్‌లో పోయింది. అయితే తమకి రావాల్సిన పారితోషికం వచ్చేస్తుంది కనుక సీన్లు కట్ అయిపోయాయని, ఫలానా సినిమాలో తన పాత్ర ఎడిటింగ్‌లో పోయిందని నటీనటులు పెద్దగా బాధ పడరు. ఇలాంటి సహజమైన విషయానికి కమెడియన్ పృధ్వీ ఫేస్బుక్లో ఘాటుగా స్పందించడం పలువుర్ని ఆశ్చర్యపరిచింది.

'ఖైదీ నంబర్ 150'లో పృధ్వీ పాత్ర మొత్తం ఎడిటింగ్‌లో పోయిందట. దాంతో అతను అది తన దురదృష్టమని పేర్కొన్నాడు. అంతటితో ఆగిపోయి వుంటే బాగుండేది. కానీ సంక్రాంతి రోజున తన తల్లి చనిపోయినంత బాధగా వుందని అనడం షాకిచ్చింది. పృధ్వీ ఎందుకింత వైల్డ్‌గా రియాక్ట్ అయ్యాడు? ఫిలింనగర్లో వినిపిస్తున్న పుకార్లని బట్టి తన పాత్ర ఇందులోంచి తొలగిపోవడానికి కారణం బ్రహ్మానందమేనని పృధ్వీ ఫీలింగట.

కమెడియన్‌గా తను ఎదిగిన తర్వాత బ్రహ్మానందం ప్రాభవం తగ్గడంతో ఆ సీనియర్ కమెడియన్‌కి తనంటే గిట్టడం లేదని పృధ్వీ అనుకుంటున్నాడట. పలుమార్లు బ్రహ్మానందం తనని చిన్నబుచ్చేలా మాట్లాడాడని కూడా తన సన్నిహితులకి చెప్పుకున్నాడట. చిరంజీవికి బ్రహ్మీ అత్యంత ఆప్తుడు కావడంతో తమ బంధాన్ని వాడుకుని తన పాత్ర ఖైదీలోంచి కట్ అయిపోవడానికి అతనే కారకుడని పృధ్వీ ఫీలింగట.

అందుకే తన పాత్ర కట్ అయిందనే సంగతి చెబుతూ, దానికి కారణమంటూ రాసిన ఒక వెబ్సైట్ ఆర్టికల్‌ని కూడా పృధ్వీ జత చేసాడని చెప్పుకుంటున్నారు. మరి పృధ్వీ ఊస్టింగ్‌కి నిజంగానే బ్రహ్మీ కారణమో కాదో అది ఆయనకీ, చిరంజీవికే తెలియాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు