నాగబాబు గారబ్బాయి కూడా ఫుల్ బీటింగ్

నాగబాబు గారబ్బాయి కూడా ఫుల్ బీటింగ్

చిరంజీవి రీఎంట్రీ ఏమో కానీ... ఖైదీ నంబర్ 150 లిరికల్ వీడియోలు యూట్యూబ్‌ని ఊపేస్తున్నాయి. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు కోటి వ్యూస్ అందుకోవడానికి దగ్గర్లో ఉంటే, నిన్న విడుదలైన థీమ్ సాంగ్ 'నీరు నీరు నీరు' కూడా ఒకే రోజులో మిలియన్ వ్యూస్ తెచ్చుకుంది.

ఈ సినిమాపై ఉన్న క్రేజ్ ఏంటనేది తెలియడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఇలా మెగాస్టార్ యూట్యూబ్‌కి కొత్త లెక్కలు చూపిస్తోంటే, ఆయన తమ్ముడి గారబ్బాయి వరుణ్ తేజ్ కూడా తానేమీ తక్కువ తినలేదని నిరూపించుకుంటున్నాడు. వరుణ్ తేజ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న 'మిస్టర్' సినిమా టీజర్‌కి యూట్యూబ్‌లో రెండు మిలియన్ వ్యూస్ వచ్చాయి.

అయిదు రోజుల్లో ఈ ఫీట్ సాధించిన వరుణ్ తేజ్ ఆనందంతో ఉప్పొంగిపోతున్నాడు. సాధారణంగా మీడియం బడ్జెట్ సినిమాలకి ఈ లెవల్లో వ్యూస్ రావడానికి కాస్త సమయం పడుతుంది. కానీ వరుణ్ తేజ్‌పై జనాలకి ఉన్న ఆసక్తి ఏంటనేది ఇది చూపించింది. శ్రీను వైట్ల తన పంథా మార్చి కొత్తరకంగా తెరకెక్కిస్తోన్న ఈ టీజర్ యూత్‌కి బాగా నచ్చింది.

టీజర్‌కి వచ్చిన స్పందనతో ఈ చిత్రానికి బిజినెస్ ఆఫర్లు కూడా బాగా వస్తున్నట్టు వినికిడి. ఇంతవరకు దక్కకుండా పోయిన హిట్టు ఈ సినిమాతో అయినా వరుణ్ని వరిస్తుందో లేదో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు