సోలో పెర్ఫార్మెన్సులతో నయన్ దూకుడు

సోలో పెర్ఫార్మెన్సులతో నయన్ దూకుడు

అందాల తార నయనతార కాస్త డిఫరెంటుగా ఉండే సినిమాను ఎంచుకున్నారు. ఈసారి పవర్ ఫుల్ రోల్ తో ప్రేక్షకులను అలరించబోతున్నారు.  అన్నీ డైనమిక్ క్యారక్టర్లే ఎంచుకుంటూ కొత్త సంవత్సరాన్ని సూపర్ సక్సెస్ గా మార్చుకోవాలని ట్రయ్ చేస్తున్నారు.

పాత్రికేయుడు శక్తివంతగా ఉంటే సమాజంలో ఎలాంటి మార్పు తీసుకురావచ్చో 'ఇజం' చిత్రంలో చూపించారు దర్శకుడు పూరీ జగన్నాథ్‌. అన్ని ఇజాల కంటే జర్నలిజం బలమైందంటూ సినిమాను తెరకెక్కించారు. సమాచార మాధ్యమాల బాధ్యతను 'ఇజం' గుర్తుచేసింది.

 ప్రస్తుతం ఇలాంటి కథతోనే నయనతార ఓ చిత్రాన్ని చేయబోతున్నారు. కొత్త చిత్రంలో పాత్రికేయురాలిగా నటిస్తున్నారు. భరత్‌ అనే దర్శకుడు ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ముప్పాతిక శాతం సినిమా చిత్రీకరణ విదేశాల్లోనే ఉంటుందట. త్వరలోనే నయనతార ఇజం షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఇది ఫీమేల్‌ ఓరియెంటెడ్‌ మూవీ.

గతంలో మాయ, అనామిక, డోరా లాంటి చిత్రాలు నయన్‌ నటించిన మహిళా ప్రధాన చిత్రాలు కాగా…ఆమె కెరీర్‌ లో మరో సినిమా చేరబోతోంది. ప్రస్తుతం నయనతార కలెక్టర్‌ పాత్రలో 'ఆరమ్‌' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో గ్రామీణ ప్రాంతాల ప్రజల తాగునీటి కష్టాలు తీర్చే జిల్లా అధికారిగా కనిపించనుంది నయనతార. ఇలా సమాజాన్ని ప్రభావితం చేసే రెండు ముఖ్యమైన పాత్రల్లో నయన్‌ నటిస్తుండటం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు