ఆస్పత్రిలో చేరిన రామోజీరావు

ఆస్పత్రిలో చేరిన రామోజీరావు

'ఈనాడు' సంస్థల అధిపతి రామోజీరావు అస్వస్థతకు గురయ్యారని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. వైరల్‌ ఫీవర్‌, వెన్నునొప్పి, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన సోమవారం నుంచి సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది.

సీనియర్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ ఎన్‌వీ రావు, పల్మనాలజిస్ట్‌ డాక్టర్‌ నవనీతసాగర్‌ రెడ్డిల బృందం రామోజీరావుకు చికిత్స అందిస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, బుధవారం స్వల్పంగా ఆహారం కూడా తీసుకున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

ఇటీవ‌లి కాలంలో రామోజీరావు సంస్థ కార్యక‌లాపాల విష‌యంలో గ‌తంలో అంత‌టి చురుకుగా పాల్గొన‌ని సంగ‌తి తెలిసిందే. ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌ల‌కే ప‌రిమిత‌మైన‌ట్లు ఈనాడు వ‌ర్గాలు చెప్తున్నాయి. తాజాగా ఆయ‌న ఆరోగ్యం విష‌యంలో వెలుగులోకి వ‌చ్చిన వార్త సంస్థ ఉద్యోగుల‌కు సైతం ఒకింత ఆల‌స్యంగా తెలిసింద‌ని స‌మాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు