ఉత్కంఠ రేపుతున్న 'ధృవ'

ఉత్కంఠ రేపుతున్న 'ధృవ'

టాలీవుడ్లో ప్రస్తుతం అందరి ఫోకస్ సంక్రాంతి సినిమాల మీదే ఉంది. గత వారం విడుదలైన 'అప్పట్లో ఒకడుండేవాడు' గురించి కూడా బాగానే చర్చ జరుగుతోంది. గత నెల రెండో వారంలో రిలీజై మంచి టాక్ తో.. వసూళ్లతో నడిచిన 'ధృవ' గురించి ఇప్పుడెవరూ చర్చించట్లేదు. ఆ సినిమా యూనిట్ సభ్యులు కూడా దాని గురించి మాట్లాడ్డం మానేశారు.

అలాగని 'ధృవ' కథేమీ ముగిసిపోలేదు. ఇంకా కూడా ఆ సినిమా ఓ మోస్తరుగా ఆడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వీకెండ్ వసూళ్లు పర్వాలేదనిపిస్తున్నాయి. ఇక్కడితో పోలిస్తే అమెరికాలో 'ధృవ' నాలుగో వారంలోనూ బాగానే పెర్ఫామ్ చేస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే.

యుఎస్‌లో మిలియన్ క్లబ్బును ఈజీగానే అందుకున్న 'ధృవ'.. ఆ తర్వాత బాగా డల్ అయింది. వీకెండ్లలో పర్వాలేదనిపించినప్పటికీ.. వీక్ డేస్‌లో కలెక్షన్లలో బాగా డ్రాప్ కనిపించింది. దీంతో 'ధృవ' అక్కడ బ్రేక్ ఈవెన్‌కు రావడం అసాధ్యమనే అనుకున్నారంతా. ఫుల్ రన్లో 1.3 మిలియన్ దగ్గర 'ధృవ' ఆగిపోతుందనుకున్నారు. కానీ నాలుగో వారంలో అనూహ్యంగా 25 స్క్రీన్లు పెంచుకున్న ధృవ మంచి వసూళ్లతో సాగిపోయింది.

ఇప్పటికే 1.45 మిలియన్ డాలర్లు వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. ఈ వారాంతంలో కొత్త రిలీజ్‌లు ఏమీ లేవు కాబట్టి.. సంక్రాంతి సినిమాలు వచ్చేవరకు 'ధృవ' జోరు కొనసాగొచ్చు. 1.5 మిలియన్ మార్కును కూడా టచ్ చేయొచ్చు. దీని కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటిదాకా మిలియన్ డాలర్ మూవీనే లేని చరణ్.. ఒకేసారి 1.5 మిలియన్ మార్కును అందుకుంటే మెగా అభిమానులకు అంత కంటే హ్యాపీ న్యూస్ ఏముంటుంది?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు