హీరోయిన్‌తో మాట్లాడాలని ఎంత పని చేశాడో..

హీరోయిన్‌తో మాట్లాడాలని ఎంత పని చేశాడో..

సెలబ్రెటీల వ్యక్తిగత ఫోన్ నంబర్లు చాలా గోప్యంగా ఉంచుతారు. ఓ మోస్తరు పేరున్న వాళ్లే ఫోన్ కాల్స్‌తో పడే ఇబ్బంది మామూలుగా ఉండదు. అలాంటపుడు సెల్రబెటీల నంబర్లు బయటికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? అందుకే తమ నంబర్లు అత్యంత సన్నిహితులకు తప్ప వేరే వాళ్లకు తెలియకుండా జాగ్రత్త పడతారు సెలబ్రెటీలు.

ఐతే తన అభిమాన కథానాయికతో నేరుగా ఫోన్లో మాట్లాడాలని పట్టుబట్టిన ఓ అభిమాని.. ఆమె నంబర్ సంపాదించేందుకు రకరకాల ప్రయత్నాలు చేసి.. చివరికి ఆమె ఇన్‌కమ్ ట్యాక్స్ అకౌంటునే హ్యాక్ చేసేశాడు. ఆ అభిమాని పోలీసు శాఖలో పని చేస్తుండటం విశేషం. అతను అంతగా అభిమానించిన హీరోయిన్ మరెవరో కాదు.. కరీనా కపూర్.

నార్త్ ఇండియాకు చెందిన ఓ 26 ఏళ్ల యువకుడికి కరీనా అంటే పిచ్చి. అతను కేంద్ర సాయుధ పోలీసు దళంలో పనిచేస్తున్నాడు. తన అభిమాన నటితో ఫోన్లో మాట్లాడాలని అతను తహతహలాడిపోయేవాడు. ఆమె నంబర్ సంపాదించేందుకు రకరకాల ప్రయత్నాలు చేసి విఫలమైన ఆ యువకుడు.. చివరికి ఆమె ఆదాయపు పన్ను ఖాతానే హాక్ చేసినట్లు వెల్లడైంది.

కరీనా పాన్ నెంబర్ ఆన్ లైన్ లో తీసుకొని దాని సాయంతో వివిధ ఐపీ అడ్రసుల ద్వారా ఆమె ఐటీ ఖాతాను హ్యాకింగ్ చేశాడు. ఐటీ రిటర్న్‌లో ఉన్న ఫోన్ నెంబర్ తీసుకుని కరీనాతో మాట్లాడేందుకు యత్నించాడు. ఐతే కరీనా చార్టర్డ్ అకౌంటెంట్ ముంబయి సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English