చిరు ఫ్యాన్స్ కు ఎక్కడో కాలేలా పొగిడేసిన వర్మ

చిరు ఫ్యాన్స్ కు ఎక్కడో కాలేలా పొగిడేసిన వర్మ

మాటలతో మంట పుట్టిస్తుంటారు వర్మ. కొన్నిసార్లు డైరెక్ట్ గా కొన్నిసార్లు పొగడ్తలతో తెగ ఇదిగా ఎటకారం చేసే వర్మ ఫోకస్ బాస్ మీద పడింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలకు సిద్ధమైన చిరు రీఎంట్రీ మూవీ ఖైదీ నెంబరు 150 పోస్టర్ మీద ఓ రేంజ్లో ఎటకారం చేసేశాడు.  స్టైల్ గా కూర్చున్నట్లుగా ఉన్నచిరు పోస్టర్ ను ఉద్దేశించి వర్మ చేసిన వ్యాఖ్యలు కాసింత ఘాటుగా ఉండటమే కాదు.. చిరు ఫ్యాన్స్ కు ఎక్కడెక్కడో కాలిపోయేలా ఉన్నాయని చెప్పక తప్పదు.

ప్రపంచ సినీ చరిత్రలోనే ఇది అత్యుద్భుతమైన పోస్టర్ అంటూ ట్వీట్ తో మొదలెట్టిన ఎటకారం.. అంతకంతకూ పెరిగిపోయి.. పీక్స్ కు చేరిందని చెప్పక తప్పదు. జేమ్స్ కామెరూన్.. క్రిస్టోఫర్ నూలన్ లాంటోళ్లు కానీ అన్నయ్య తాజా పోస్టర్ చూస్తే.. డిప్రెషన్ లోకి వెళ్లిపోవటం ఖాయమంటూ వీర లెవల్లో పొగిడేసిన వర్మ.. జర్మన్ ఫిలాసఫర్ జార్జ్విల్ హెల్మె ఫ్రెడ్రిక్ హెగెల్ కనుక ఇప్పుడు కానీ ఉండే మెగాస్టార్ ను ముద్దాడేవాడని చురకలెట్టేశాడు.

తాజాగా విడుదల చేసిన పోస్టర్ కోసం.. మేడం టుస్సాడ్స్ మ్యూజియం వాళ్లు.. తమ దగ్గరున్న సగం విగ్రహాల్ని రోడ్ల మీదకు పడేస్తారంటూ పీక్స్ తీసుకెళ్లిన పొగడ్తల ఎటకారంతో తనదైన శైలిలో.. పాదాలను తాకాలని ఉందన్న పదాన్ని కూడా ప్రస్తావించారు. ఈ పోస్టర్ తయారు చేసిన డైరెక్టర్.. డిజైనర్ పాదాల్ని తాకాలని ఉందన్న వర్మ.. బాస్ ను ఈ స్టిల్ కోసం ఒప్పించిన వారి పేర్లు.. ఫోన్ నెంబర్లు తెలుసుకోవాలని ఉందన్న ఆసక్తిని ప్రదర్శించారు. మరి.. వర్మ తాజా ఎటకారానికి మెగా ఫ్యాన్స్ ఎంతలా చెలరేగిపోతారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు