దిమ్మ‌దిరిగిపోయే ట్రైల‌ర్.. చూసి త‌రించండి

దిమ్మ‌దిరిగిపోయే ట్రైల‌ర్.. చూసి త‌రించండి

ఆల్రెడీ బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ విన్యాసాల్ని చూసి మైమ‌రిచిపోతున్నారు తెలుగు ప్రేక్ష‌కులు. ఇప్పుడు అత‌డి బాట‌లో ఇంకో క‌థానాయ‌కుడు వ‌చ్చాడు. అత‌నే ప‌బ్లిక్ స్టార్ జొన్న‌ల‌గ‌డ్డ శివ‌. ఈయ‌న టాలెంటేంటో తెలియాలంటే 'పోలీస్ ప‌వ‌ర్' అనే పేరుతో త‌నే క‌థానాయ‌కుడిగా న‌టిస్తూ.. ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ తెర‌కెక్కించిన సినిమా ట్రైల‌ర్ చూడాల్సిందే.

పోలీస్ అంటే ఏంటో ప‌వ‌ర్ ఫుల్ ఇంట్ర‌డ‌క్ష‌న్ ఇస్తూ చెల‌రేగిపోయాడు శివ జొన్న‌ల‌గ‌డ్డ‌. ట్రైల‌ర్లో ఆయ‌న విన్యాసాల గురించి ఎంత చెప్పినా త‌క్కువే. సింగం సూర్య త‌ర‌హాలో సూప‌ర్ కాప్ లాగా రెచ్చిపోయాడు.

ట్రైల‌ర్ అంత‌టా ఆయ‌న విన్యాసాల గురించి ఏమ‌ని వ‌ర్ణించాలో? ఈ సినిమాకు జొన్న‌ల‌గడ్డ శివ హీరో మాత్రమే కాదు క‌థ‌.. స్క్రీన్ ప్లే.. ద‌ర్శ‌క‌త్వం.. మాట‌లు.. పాట‌లు..  సంగీతం.. నృత్యం.. నిర్మాణం.. క్రెడిట్స్ కూడా ఆయ‌న‌వే. ఖాకీ ఉంటేనే పోలీస్ క‌మిష‌న‌ర్ అని.. అది తీసేస్తే రౌడీ క‌మిష‌న‌ర్ అని చెబుతూ.. బ‌నియ‌న్ తిర‌గేసుకుని రౌడీల్ని మ‌ట్టిక‌రిపించిన తీరు మామూలుగా లేదు.

బాల‌య్య త‌ర‌హాలో పోలీస్ డైలాగులు చెబుతూ ట్రైల‌ర్ ఆద్యంతం రెచ్చిపోయాడు. మొత్తానికి సంపూను మించిన బిల్డ‌ప్ రాజాలా ఉన్నాడు జొన్న‌ల‌గ‌డ్డ శివ‌. మ‌రి ప‌బ్లిక్ స్టార్ కూడా బ‌ర్నింగ్ స్టార్ లాగే ఫేమ‌స్ అయిపోతాడేమో చూద్దాం.