మిస్ అమెరికా మనసులో మన హీరో!

మిస్ అమెరికా మనసులో మన హీరో!

ఇటీవల ఓ తెలుగు అమ్మాయి మిస్ అమెరికా కిరీటాన్ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించిందన్న విషయం తెలుసు కదా! ఆమే... నీనా దవులూరి. ఈమె తండ్రి తూర్పు గోదావరి జిల్లాకు చెందినవారు. కానీ చాలా యేళ్ల క్రితమే అమెరికా వెళ్లి స్థిరపడిపోయారు. నీనా అక్కడే పుట్టి పెరిగింది. అక్కడే చదువుకుంది. కార్డియాలజిస్టు కావాలని తపన పడుతోంది. మొదట్నుంచీ మోడలింగ్ అంటే ఇష్టం ఉండటంతో అటువైపు కూడా అడుగులేసింది. ఫలితంగా మిస్ అమెరికా కిరీటమే వచ్చి ఆమె తలను అలంకరించింది.

ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికరమైన విషయం చెప్పిందీ చిన్నది. ఈమెకి మన హీరో ప్రభాస్ అంటే మహా ఇష్టమట. వర్షం సినిమా చూసి అతడి ఫ్యాన్ అయిపోయిందట. అప్పట్నుంచీ అతడి సినిమాలన్నీ చూస్తూనే ఉందట. అతడి నటన సూపర్ అంటూ పొగిడేసింది. కొంపదీసి అప్పుడే సినిమాలకు, అది కూడా తెలుగు సినిమాలకు గురిపెట్టడం లేదు కదా! ఆల్రెడీ విదేశాల్లో అందాల రాణులుగా ప్రశంసలు పొందిన రిచా గంగోపాధ్యాయ, విమలా రామన్ లాంటి వాళ్లు వచ్చి ఇక్కడ తిష్ట వేయడానికి తెగ తంటాలు పడుతున్నారు. ఇప్పడు ఈమె కూడా అదే ప్లాన్ వేయడం లేదు కదా! వేసినా పోయేదేముందిలెండి! అందంగా ఉంది. భరతనాట్యం, కూచిపూడి లాంటి డ్యాన్సులు అదరగొట్టేస్తుంది. పైగా తెలుగు పిల్ల. వస్తానంటే టాలీవుడ్ వద్దంటుందా!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు