రెచ్చిపోతున్న శృతిహాసన్‌

రెచ్చిపోతున్న శృతిహాసన్‌

గబ్బర్‌సింగ్‌ విజయంతో పెరిగిన ఆత్మ విశ్వాసమో, లేక నటిగా సాహసాలు చేయకపోతే పేరు తెచ్చుకోలేమని అనుకుంటోందో కానీ కెరీర్‌లో తొలి నాళ్లలోనే సాహసోపేతమైన పాత్రలకి ఆమె సై అంటోంది. 'డీ డే' అనే హిందీ సినిమాలో శృతి హాసన్‌ వేశ్య పాత్ర పోషిస్తోంది. వేశ్య పాత్ర అంటే వేషధారణ వరకే పరిమితం అనుకుంటే పొరబడ్డట్టే. సెక్సువల్‌ యాక్ట్‌లో ఉన్న సీన్స్‌ కూడా ఆమె నిర్భయంగా చేసేసింది.

ఈ చిత్రంలోని ఈ స్టిల్‌ సంచలనం సృష్టిస్తోంది. శృతిహాసన్‌ ధైర్యాన్ని మెచ్చుకునేలా చేస్తోంది. తన తండ్రి నటుడిగా ఎలాంటి పాత్ర చేయడానికైనా వెనుకాడరు. అలాగే శృతి కూడా తండ్రినే ఫాలో అయిపోతున్నట్టుంది. ఇంతవరకు శృతి చేసిన పాత్రలు ఒక ఎత్తు... ఇదొక ఎత్తు అనే ఫీలింగ్‌ కలుగుతోంది. స్టిల్స్‌లోనే ఇంత వేడి పుట్టిస్తోంటే ఇక తెరపై శృతి శృంగార విన్యాసాలు ఇంకెంతగా ఉష్ణోగ్రతలు పెంచేస్తాయో వేచి చూడాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English