గీతా ఆర్ట్స్.. పరశురామ్.. విజయ్

గీతా ఆర్ట్స్.. పరశురామ్.. విజయ్

టాలీవుడ్లో మరో ఆసక్తికర కాంబినేషన్‌కు రంగం సిద్ధమైంది. 'గీతా ఆర్ట్స్' బేనర్ మీద ఓవైపు భారీ చిత్రాలు తీస్తూనే.. మరోవైపు గీతా ఆర్ట్స్-2 బేనర్లో చిన్న సినిమాలు నిర్మిస్తున్న అల్లు అరవింద్.. ఈ సంస్థలో మరో సినిమాకు రంగం సిద్ధం చేశారు. 'శ్రీరస్తు శుభమస్తు' సినిమాతో అల్లు శిరీష్‌కు తొలి విజయాన్నందించిన పరశురామ్‌తో అరవింద్ మరో సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాలో నాన్-మెగా హీరో నటిస్తుండటం విశేషం. ఆ హీరో మరెవరో కాదు.. 'పెళ్లిచూపులు'తో ఓవర్ నైట్ సూపర్ ఫాలోయింగ్ సంపాదించిన విజయ్ దేవరకొండ. 'పెళ్లిచూపులు' తర్వాత దాదాపు అరడజను సినిమాలు కమిటైన విజయ్.. ప్రతిష్టాత్మక 'గీతా ఆర్ట్స్' బేనర్లోనూ అవకాశం పట్టేశాడు.

పరశురామ్ చెప్పిన కథ సింగిల్ సిట్టింగ్‌లో ఓకే అయిపోయిందని.. తమ బేనర్లో ఇది మరో మంచి సినిమా అవుతుందని గీతా ఆర్ట్స్-2 బేనర్ వ్యవహారాలు చూసే బన్నీ వాసు తెలిపాడు.

జీఏ-2 బేనర్లో చివరగా తెరకెక్కించిన 'భలే భలే మగాడివోయ్' బ్లాక్ బస్టర్ హిట్టయింది. దాని తర్వాత ఆ బేనర్ నిర్మించబోయే సినిమా ఇదే. విజయ్ గీతా ఆర్ట్స్ బేనర్లో ఇంకో సినిమా కూడా చేయబోతున్నాడు. 'భలే భలే మగాడివోయ్' తరహాలోనే జీఏ-2.. యువి క్రియేషన్స్ ఉమ్మడిగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆ చిత్రానికి ఇంకా దర్శకుడు ఖరారు కాలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు