'మనీ' లో ఆ పాట.. ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ

'మనీ' లో ఆ పాట.. ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ

తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ కామెడీ ఎంటర్టైనర్లలో 'మనీ' ఒకటి. అందులో ప్రతి సన్నివేశం.. ప్రతి పాటా ప్రత్యేకమే. ముఖ్యంగా భద్రం బీకేర్ ఫుల్ బ్రదరూ.. పాట ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటుంది. ఈ పాట వెనుక కొన్ని ఆసక్తికర విశేషాల్ని కోట శ్రీనివాసరావు ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అసలు ఈ పాట వద్దే వద్దని అందరూ అంటే వర్మ ఎలా పట్టబట్టి తనపై పాటను తీసింది వివరించారు.

''మనీ సినిమాలో  భద్రం బీకేర్‌ ఫుల్‌ బ్రదరూ.. పాటతో పాటు నా మీద వచ్చే సీన్లన్నీ కేవలం ఒక్క రోజులోనే పూర్తి చేసేశారు. ఆ పాట కోసం డ్యాన్స్ డైరెక్టర్ని కూడా పెట్టుకోలేదనుకుంటా. ఉదయం 11 మధ్యలో షూటింగ్‌ మొదలుపెట్టారు. మామూలుగానే లంచ బ్రేక్‌ ఇచ్చారు. కానీ రాత్రి ఏడున్నరకల్లా షూటింగ్ మొత్తం పూర్తయింది. నిజానికి భద్రం బీకేర్ ఫుల్ బ్రదరరూ పాటను పరేశ్ రావల్‌ గారు ఒక్కరి మీదే తీశారు. కానీ అది వర్మ గారికి పెద్దగా నచ్చలేదట. దీంతో నాతో రీషూట్‌ చేశారని తెలిసింది. అయితే తర్వాత ఇండస్ట్రీలో కొందరికి ప్రివ్యూ షో వేస్తే వాళ్లు నా ట్రాక్‌.. భద్రం బీకేర్ ఫుల్ బ్రదరూ పాట బాగాలేవని.. తీసేయమని చెప్పారట. కానీ వర్మ గారు మాత్రం ఎవరి మాటా వినకుండా అలాగే సినిమా రిలీజ్ చేశారు. సినిమా విడుదలయ్యాక వర్మ గారి నమ్మకమే నిజమైంది. ఆ పాట.. నా ట్రాక్ సినిమాకు ప్లస్సయ్యాయి. ఇప్పటికీ అమెరికాకు వెళ్తే.. మనీ సీన్లో డైలాగులు చెప్పమని చెబుతుంటారు'' అని కోట గుర్తు చేసుకున్నారు.

వర్మ సినిమాలకు స్క్రిప్టు పుంఖానుపుంఖాలుగా ఉండేది కాదని.. అప్పటికప్పుడు సీన్ చెప్పి.. స్పాట్లో డైలాగులు రాయించి.. షూట్ చేసేవాళ్లని.. తాను కూడా కొన్నిసార్లు డైలాగుల సాయం చేశానని.. 'సర్కార్' షూటింగ్ సందర్భంగా తాను చెప్పిన ఓ డైలాగ్ విని వర్మ థ్రిల్ అయిపోయాడని కోట చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు