కన్నడలో కూడా హిట్టయ్యాడు

కన్నడలో కూడా హిట్టయ్యాడు

కొన్ని సెంటిమెంట్లు బ్రేక్ అయినప్పుడు భలే అనిపిస్తుంటుంది. ఇలాంటిదే ఇప్పుడు కన్నడ, తెలుగు సినిమా ఇండస్ట్రీల్లో జరిగింది. ఇంత కాలం.. తెలుగులో పెద్ద హిట్లు కొట్టిన సినిమాలు చాలావరకు.. కన్నడలో అట్టర్ ఫ్లాప్ అయిన చరిత్ర ఉంది. కానీ.. మన నాని మాత్రం ఆ చరిత్రను తిరగరాశాడు.

మారుతి డైరెక్షన్ లో వచ్చిన భలే భలే మొగడివోయ్ సినిమా టాలీవుడ్ లో పెద్ద హిట్ గా నిలిచింది. నానిని 10 మిలియన్ డాలర్ల కలెక్షన్ క్లబ్ లో చేర్చింది. ఈ సినిమా కన్నడలో.. గణేష్, శాన్వి లీడ్ రోల్స్ లో.. రమేశ్ అరవింద్ డైరెక్షన్ లో.. సుందరాంగ జానా పేరుత రీ మేక్ అయ్యింది.

తెలుగు లో బంపర్ హిట్ అయినట్టే.. కన్నడలో కూడా ఈ సినిమా హిట్ కొట్టింది. దీంతో.. నానితో పాటు.. దర్శకుడు మారుతి కూడా.. కన్నడ ఇండస్ట్రీలో టాలీవుడ్ సినిమా రీ మేక్ ల చరిత్ర మారినందుకు కారణమయ్యారని అంతా అంటున్నారు.