ఎన్నాళ్లో వేచిన ఉదయం

ఎన్నాళ్లో వేచిన ఉదయం

సౌత్ లో హీరోలతో సమానమైన ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లు ఇద్దరున్నారు. ఒకరు అనుష్క అయితే మరొకరు నయనతార. కానీ హీరోల కంటే ఎక్కువ పారితోషికం డిమాండ్ చేసే సీన్ ఉన్న హీరోయిన్ మాత్రం ఒక్కరే. ఆమే నయనతార. నయన్ ఫేస్ చూస్తేనే సినిమా ఆడేసేంతగా ఆమెకు క్రేజ్ పెరిగిపోయింది.

కోలీవుడ్ మహారాణిగా చలామణీ అవుతున్న నయనతార.. ఒకటి కాదు. రెండు కాదు.. ఆరేడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. చివరకు వెంకీతో బాబు బంగారం చేయడానికి నయన తార మారుతికి చుక్కలు చూపించింది. ఇంత బిజీగా ఉన్న అమ్మడికి పాత ప్రియుడ్ని చూసేసరికి మనసులో వీణ మోగిందట.

ఒకప్పుడు ప్రభుదేవా కోసం నయన ఏమైనా చేయడానికి సిద్ధపడింది. బిజీగా ఉన్న టైమ్ లో కెరీర్ వదిలేసుకుంటానని ప్రకటించింది. అటు ప్రభుదేవా కూడా మొదటి భార్య రమలత్ కు విడాకులిచ్చాడు. ఇక నయన్, ప్రభు పెళ్లే తరువాయి అనుకున్నారు. కానీ అంతలోనే మనస్పర్థలొచ్చి విడిపోయారు.

చాన్నాళ్ల తర్వాత చెన్నైలోని ఓ హోటల్లో కలిసిన ఈ పాతప్రేమికులు.. మరోసారి గతకాలపు తీపి గుర్తులు నెమరవేసుకున్నారట. ఇద్దరూ చిలకాగోరింకల్లా చాలాసేపు మాట్లాడుకోవడంతో.. మళ్లీ ప్రేమ చిగురించిందేమోనని చెన్నై మీడియా కోడై కూస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English