అనంతపురం బ్యాక్ డ్రాప్ లో రానా

అనంతపురం బ్యాక్ డ్రాప్ లో రానా

'బాహుబలి.. ది కన్ క్లూజన్' ఓ వైపు.. 'ఘాజీ' మరోవైపు చేస్తున్న దగ్గుబాటి రానా... మరో సినిమాను కూడా మొదలెట్టేస్తున్నాడు. ఇది అనంతపురం జిల్లా బ్యాక్ డ్రాప్ లో నడిచే ఓ యాక్షన్ చిత్రమని సమాచారం.

సురేష్.. భరత్ చౌదరి అనే ఇద్దరు డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలుగా మారి రానాతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. పూర్తి యాక్షన్ డ్రామాతో నడిచే ఈ సినిమా జనవరి 2వ తేదీ నుంచి అనంతపురం జిల్లా ఉరవకొండ పరిసరప్రాంతాల్లో జరగనుంది. గతంలో ఇక్క శ్రీరాములయ్య, కృష్ణగాడి వీర ప్రేమగాథ లాంటి చిత్రాలను ఈ ప్రాంతంలో తెరకెక్కించారు.

ఈ లొకేషన్స్ లో రానా సినిమా షూట్ చేయడానికి తేజ రెడీ కావడంతో.. ఈ సినిమా జోనర్ ఏంటో తెలిసిపోతోంది. ఫ్యాక్షన్.. మావోయిస్టు ప్రాబల్యం వున్న ఈ ప్రాంతాల్లో విశాలమైన ఇళ్లు.. ఇరుకైన సంధులు ఎక్కవగా వుంటాయి. రాకెట్ల.. ఆముదాల.. మోపిడి.. ఉరవకొండ తదితర ప్రాంతాల్లో ఎక్కవగా రాతితో కట్టిన పెద్ద పెద్ద ఇళ్లు మనకు దర్శనం ఇస్తాయి. అలాంటి లొకేషన్స్ లో ఈ చిత్రం షూటింగ్ అంటేనే.. ఇదేదో ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కనున్న యాక్షన్ సినిమా అని తెలిసిపోతోంది.

అలాగే ఇందులో రానా గెటప్ అదిరిపోయేలా వుంటుందట. గతంలో గోపీచంద్ లుక్ ఎలాగైతే రఫ్ లుక్ వుండేదో.. అలానే ఇందులో కూడా రానా లుక్ వుంటుందని సమాచారం. ఇప్పటికే చిత్ర యూనిట్ అనంతపురంలో దిగిపోయింది. ఇక రానా..కాజల్ మాత్రమే అక్కడ జాయిన్ అవ్వాల్సివుంది. అనంతపురం హెడ్ క్వార్టర్లో కూడా రామ్ నగర్ ఫ్లై ఓవర్ పై ఓ ఫైట్ తో పాటు కొన్ని సీన్లను చిత్రీకరించడానికి ప్లాన్ చేయనున్నారట చిత్ర బృందం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English