టాలీవుడ్ లో రచ్చ రేపిన 2016

టాలీవుడ్ లో రచ్చ రేపిన 2016

తెలుగు సినీ ఇండస్ర్టీలో 2016 అద్భుతమైన హిట్లు ఇవ్వడమే కాదు, పలు వివాదాలకూ తెరలేపింది. బాలకృష్ణ, పూరీ జగన్నాథ్, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు వంటివారు కూడా వివాదాల్లో ఇరుక్కున్నారు.

- లోఫర్ సినిమా డిజాస్టర్ కావడంతో తామంతా ఆర్థికంగా నష్టపోయామంటూ ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు తనపై దాడికి దిగారంటూ పూరీ జగన్నాథ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

- మార్చిలో జరిగిన నారా రోహిత్ సినిమా సావిత్రి ఆడియో ఫంక్షన్లో బాలకృష్ణ చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. మహిళలనలు కించపరిచేలా ఆయన అన్న మాటలు వివాదం రేపాయి.  తాను సినిమాల్లో టీజింగ్ చేసినంత మాత్రాన తన అభిమానులు సంతోషించరని.. కడుపు చేసేయడమేనని ఆయన చేసిన వ్యాఖ్యలు పెను వివాదాన్నే రేపాయి.

- హిందూపురంలో స్థానిక ఎమ్మెల్యేగా బాలకృష్ణ నిర్వహించిన లేపాక్షి ఉత్సవాల ఆహ్వానాల విషయంలోనూ వివాదం ఏర్పడింది.  సినిమారంగంలోని అందరినీ పిలిచినా చిరంజీవిని పిలవకపోవడం వివాదమైంది.

- బాహుబలి -2 సీన్ల లీకేజీ కూడా సంచలనం రేపింది. టెక్నికల్ టీంలో ఉన్నవారు నిర్మాణ సమయంలోనే కొన్ని క్లిప్లింగులను బయటకు తేవడం రచ్చగా మారింది. అయితే... ఇది కూడా రాజమౌళి పబ్లిసిటీ స్టంటేనన్న అనుమానాలూ ఉన్నాయి.

- అ.. ఆ.. సినిమాలో రెడ్డి పేరుతో చేసిన కామెడీ సీన్లపై ఆ వర్గం వారు మండిపడ్డారు. దీంతో  ఆ సీన్లను తొలగించారు.

- జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమా రిలీజ్ సందర్భంగా ఆ నిర్మాత తనకు డబ్బులు ఇవ్వకపోవడంపై పవన్ కళ్యాణ్  కేసు వేయడం  కూడా వివాదమైంది.

- ఇక ఏడాది చివర్లో రాంగోపాల్ వర్మ తీసిన వంగవీటి సినిమా రేపుతున్న వివాదం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు