'సప్తగిరి ఎక్స్‌ప్రెస్'కు సీక్వెల్!

'సప్తగిరి ఎక్స్‌ప్రెస్'కు సీక్వెల్!

పూరి జగన్నాథ్ తన ప్రతి సినిమాకూ సీక్వెల్ ఉంటుంది అని ఆ సినిమా రిలీజ్ అయిన టైంలో అంటుంటాడు. కానీ ఆ తర్వాత ఆ ఊసే ఎత్తడు. ఇలా 'సీక్వెల్' అనే మాటను సినిమా ప్రమోషన్ కోసం ఉపయోగించుకుని.. ఆ తర్వాత సైలెంటైపోవడం ఇండస్ట్రీలో మామూలే. మరి కమెడియన్ టర్న్డ్ హీరో సప్తగిరి కూడా ఆ తరహాలోనే అన్నాడో లేక నిజంగానే ఆలోచన ఉందో కానీ.. 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' సినిమాకు సీక్వెల్ ఉంటుందని చెప్పాడతను.

ఈ సినిమాకు నెగెటివ్ రివ్యూలు రాయడంపై సక్సెస్ మీట్లో చాలా ఎమోషనల్ అయిపోతూ కన్నీళ్లు పెట్టేసుకున్న సప్తగిరి.. వాస్తవంగా తన సినిమాకు చాలా మంచి కలెక్షన్లు వస్తున్నాయని చెప్పాడు. మాస్ ప్రేక్షకులు తన సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారని.. ఆ రెస్పాన్స్ చూశాక ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలని నిర్ణయించుకున్నామని.. 2017లోనే ఈ చిత్రం ఉంటుందని.. 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' తీసిన రవికిరణే దీనికీ నిర్మాత అని ప్రకటించాడు సప్తగిరి.

అంతే కాక తనే నిర్మాతగా.. హీరోగా 2017లో ఇంకో సినిమా కూడా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సప్తగిరి చెప్పడం విశేషం. 'తిరుడన్ పోలీస్' అనే తమిళ చిత్రానికి రీమేక్‌గా వచ్చిన 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్'కు అరుణ్ పవార్ దర్శకుడు. ఈ చిత్రానికి సప్తగిరి రచనా సహకారం కూడా అందించాడు. 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్'కు ఓపెనింగ్స్ అయితే బాగానే వచ్చాయి. సినిమా బ్రేక్ ఈవెన్‌కు వచ్చినట్లే అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు