మారుతి సినిమా అక్కడా హిట్టే

మారుతి సినిమా అక్కడా హిట్టే

ఒకప్పుడు పొరుగు భాషల నుంచి మనం కథలు అరువు తెచ్చుకోవడమే ఉండేది. కానీ ఈ మధ్య తెలుగు సినిమాలు కూడా పొరుగు భాషల్లోకి బాగా వెళ్తున్నాయి. మంచి ఫలితాలందుకుంటున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి మారుతి సినిమా 'భలే భలే మగాడివోయ్' కూడా చేరింది. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అంచనాల్ని మించి అద్భుత ఫలితం రాబట్టుకుంది. ఈ చిత్రాన్ని కన్నడలో 'సుందరాంగ జాణ' అనే పేరుతో రీమేక్ చేశారు. డిసెంబరు 23న ఆ చిత్రం విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. పాజిటివ్ రివ్యూలతో.. మంచి కలెక్షన్లతో రన్ అవుతోంది ఈ చిత్రం. ఈ సందర్భంగా మారుతి సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్లు పెట్టాడు. ఇంతకుముందు తన 'ప్రేమకథా చిత్రమ్' తమిళంలోకి రిలీజై విజయం సాధించిన విషయాన్ని కూడా అతను ప్రస్తావించాడు.

తెలుగు ప్రేక్షకులకు నటుడిగా సుపరిచితుడైన సీనియర్ ఆర్టిస్ట్ రమేష్ అరవింద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. గోల్డెన్ స్టార్ గణేష్. హీరోగా చేశాడు. తెలుగులో హీరోయిన్ గా చేసి ఈ మధ్యే శాండిల్ వుడ్లో సెటిలైన శాన్వి ఈ చిత్రంలో కథానాయికగా నటించింది. తెలుగు వెర్షన్ నిర్మాతగా భారీ లాభాలు అందుకున్న అల్లు అరవింద్.. కన్నడలో రాక్ లైన్ వెంకటేష్తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాడు. తెలుగు వెర్షన్ కు దాదాపు డిట్టోలాగా ఈ సినిమాను రూపొందించాడు రమేష్ అరవింద్.