పవన్-త్రివిక్రమ్ సినిమాలో ఆమె

పవన్-త్రివిక్రమ్ సినిమాలో ఆమె

హీరోయిన్‌గా ఒక దశలో అటు తమిళంలోనే కాక తెలుగులోనూ ఒక ఊపు ఊపింది ఖుష్బూ. తెలుగులో అప్పటి స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేసిందామె. హీరోయిన్‌గా రిటైరైపోయాక సినిమాలు బాగా తగ్గించేసిన ఖుష్బూ.. ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి సినిమా 'స్టాలిన్'లో ఆయనకు అక్కగా నటించిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత మళ్లీ తెలుగు వైపు చూడలేదు ఖుష్బూ. ఇప్పుడామె మళ్లీ టాలీవుడ్లో అడుగుపెడుతోంది. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమాతో ఆమె రీఎంట్రీ ఇస్తుండటం విశేషం. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్ స్టార్ నటించే సినిమాలో ఖుష్బూ కీలక పాత్రకు ఎంపికైంది. ఈ విషయాన్ని ఖుష్బూనే స్వయంగా కన్ఫమ్ చేసింది.

''తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ తెలుగు సినిమా చేయబోతున్నా. పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్‌ల ప్రెస్టీజియస్ మూవీలో కీలకపాత్ర చేస్తున్నా'' అని ఖుష్బూ ట్విట్టర్లో వెల్లడించింది. కొన్ని రోజుల కిందటే కోలీవుడ్లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న కీర్తి సురేష్ పవన్-త్రివిక్రమ్ సినిమాకు కథానాయికగా ఎంపికైంది. ఆమె కూడా ట్విట్టర్లో ఇలాగే స్వయంగా ఆ విషయాన్ని వెల్లడించింది.

మరోవైపు  ఈ చిత్రంలో మరో కీలక పాత్రకు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పేరును పరిశీలిస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. మొత్తానికి ఈ చిత్రంలో కీలక పాత్రలన్నీ పరభాషా నటులకే దక్కేలా కనిపిస్తున్నాయి. ఎస్.రాధాకృష్ణ నిర్మించే ఈ చిత్రం ఇంకో రెండు నెలల్లో సెట్స్ మీదికి వెళ్లే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు