క‌ళ్యాణ్ రామ్ కొట్టిపారేశాడు

క‌ళ్యాణ్ రామ్ కొట్టిపారేశాడు

ఒక స్టార్ హీరో ఓ కొత్త సినిమా క‌మిట‌య్యాడంటే చాలు.. దాని గురించి ర‌క‌ర‌కాల ఊహాగానాలు మొద‌లైపోతాయి. సినిమా చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్న‌ప్ప‌టి నుంచే కాస్టింగ్ గురించి..ఇత‌ర విశేషాల గురించి చ‌ర్చ‌లు మొద‌లైపోతాయి. రూమ‌ర్లు వ‌చ్చేస్తాయి. జూనియ‌ర్ ఎన్టీఆర్ కొత్త సినిమా గురించి కూడా కొన్ని రోజులుగా ఇలాంటి ప్ర‌చారాలు చాలానే జ‌రిగాయి.

ఈ చిత్రంలో క‌థానాయిక‌లుగా కాజ‌ల్ అగ‌ర్వాల్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్, నివేదా థామ‌స్‌ల‌ను ఫైన‌లైజ్ చేశార‌ని.. అలాగే ఈ చిత్రానికి న‌ట విశ్వ‌రూపం అనే టైటిల్ అనుకుంటున్నార‌ని జోరుగా వార్త‌లు వ‌చ్చాయి. ఐతే ఇవ‌న్నీ శుద్ధ అబద్ధాల‌ని కొట్టి పారేశాడు ఈ చిత్ర నిర్మాత నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్.

"ఎన్టీఆర్‌ 27వ చిత్రం టైటిల్‌, నటీనటుల గురించి అనేక పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి నిజం కాదు. అవి అధికారికమైతే.. మేమే స్వయంగా ప్రకటిస్తాం" అని క‌ళ్యాణ్ రామ్ నిర్మాణ సంస్థ ఎన్టీఆర్‌ ఆర్ట్స్ ట్విట్ట‌ర్ పేజీలో పేర్కొన్నారు.

టైటిల్ సంగ‌తి ఎలా ఉన్నా ఎన్టీఆర్ కొత్త సినిమాలో హీరోయిన్ల గురించి వ‌చ్చిన వార్త మాత్రం నిజ‌మే అనుకున్నారంతా. మ‌రి ఆ సంగ‌తి కూడా అబ‌ద్ధ‌మే అని తేల్చేసింది ఎన్టీఆర్ ఆర్ట్స్. మ‌రి ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేస్తున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఎవ‌ర‌వుతారో చూడాలి. సంక్రాంతి త‌ర్వాత షూటింగ్ ఆరంభించనున్న నేప‌థ్యంలో ఇంకొన్ని రోజుల్లోనే అధికారిక స‌మాచారం బ‌య‌టికి వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English