అవి ఇప్పుడొస్తే పెద్ద హిట్లు

అవి ఇప్పుడొస్తే పెద్ద హిట్లు

తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకులంతా కూడా ప్రేక్షకుల అభిరుచి మేరకే సినిమాలు తీస్తుంటారు. వారు కొత్తదనాన్ని ఆహ్వానించరేమో అనే భయంతో రొటీన్‌ చిత్రాలే తీసి జనం నెత్తిన రుద్దుతుంటారు. వెరైటీ సినిమాలు తీయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని నిర్మాతలు కూడా వాటిని ప్రోత్సహించరు. కానీ ఏటికి ఎదురీదే తత్వమున్న కొందరు దర్శకులు మాత్రం ఎల్లప్పుడూ వైవిధ్యాన్నే నమ్ముకుంటారు.

అలాంటి అరుదైన దర్శకుల్లో ఒకడు ఏలేటి చంద్రశేఖర్‌. ఇతను తీసిన సినిమాలకి వచ్చిన వసూళ్ల కంటే దర్శకుడిగా వచ్చిన మంచి పేరే ఎక్కువ. ఐతే, అనుకోకుండా ఒక రోజులాంటి మోడ్రన్‌ క్లాసిక్స్‌ని ఈ దర్శకుడు తెరకెక్కించాడు. ఆ చిత్రాలకి మంచి పేరు అయితే వచ్చింది కానీ అందుకు తగ్గ వ్యాపారం జరగలేదు. ఆ సినిమాలు అప్పుడు రావడం వల్ల సరిగా ఆడలేదని, ఇప్పుడు ఆ తరహా చిత్రాలని చూసే ప్రేక్షకులు పెరిగారని, ఇప్పుడు రిలీజ్‌ అయినట్టయితే అవి పెద్ద హిట్లు అయ్యేవని ఏలేటి అంటున్నాడు. అదీ నిజమే అనుకోవాలి. స్వామి రారా చిత్రం సాధించిన విజయమే అందుకు ఉదాహరణ.

చాలా కాలం తర్వాత వస్తున్న సాహసంతో ఏలేటి తన ప్రత్యేకత చాటుకున్నట్టయితే అతను కోరుకుంటోన్న ఆ భారీ విజయం ఈ చిత్రంతోనే లభించవచ్చు. ఏలేటి లాంటి దర్శకులు సక్సెస్‌ అయితే పరిశ్రమకి ఎంతో లాభం కాబట్టి అది జరుగుతుందనే ఆశిద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English