రంగా ఫ్యాన్సు లెక్క తేలుస్తానన్న రాంగోపాల్ వర్మ

రంగా ఫ్యాన్సు లెక్క తేలుస్తానన్న రాంగోపాల్ వర్మ

వివాదాస్పద అంశాన్ని తెరకెక్కించడమే కాకుండా సినిమా రిలీజయిన తరువాత తలెత్తుతున్న వివాదాల విషయంలోనూ మరింత వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారు దర్శకుడు రాంగోపాల్ వర్మ. ముఖ్యం గా ఈ సినిమాలో రంగాను ఒక రౌడీగా చూపించారన్న రంగా అభిమానుల ఆరోపణలను ఆయన ఏమాత్రం లక్షపెట్టకుండా మరింత రెచ్చగొడుతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆయన ధోరణి కూడా అలాగే కనిపిస్తోంది.

తాజాగా  రాధారంగా మిత్రమండలిపై రాంగోపాల్ వర్మ మరోసారి మండిపడ్డారు. పనీపాటా లేకుండా వీధుల్లో తిరిగే వారంతా రంగా, రాధాల పేరు చెడగొట్టడానికి పుట్టారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంతేకాదు...  మీ లోపలి కుళ్లును పెట్రోలు కూడా లేకుండా తగలబెడతానని వారిని హెచ్చరించారు. తాను క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని.. ఇంకా ఎక్కువ చేస్తే మీరంతా ఎవరెవరు ఏ జాతన్నది మొత్తం బయటపెడతానని రివర్సయ్యారు.

తాము సినిమా షూటింగులో పాల్గొన్నప్పుడు చిత్రీకరించిన సన్నివేశాలేవీ సినిమాలో లేవని, అసలు రంగా చేసిన సమాజసేవ లాంటివాటిని చూపించలేదని, అందువల్ల వాటిని కూడా కలిపి సినిమాను రీ రిలీజ్ చేయాలని రాధా రంగా మిత్రమండలి సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.  వర్మకు డబ్బులే కావాలనుకుంటే రాధా రంగా అభిమానులు చందాలు వేసుకుని ఇచ్చేవారని రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ కూడా విమర్శించారు.  అయితే.. వర్మ మాత్రం వారితో ఢీ అంటే ఢీ అంటే మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు