ఇంతకీ మోక్షజ్న ఉన్నట్లా లేనట్లా?

ఇంతకీ మోక్షజ్న ఉన్నట్లా లేనట్లా?

నందమూరి బాలకృష్ణ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి'. వందో సినిమా అంటే ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలోనే తెరకెక్కినట్లుగా ఉంది ఈ చిత్రం. టీజర్.. ట్రైలర్ చూస్తే అద్భుతమైన అనుభూతి కలిగింది తెలుగు ప్రేక్షకులకు. బాలయ్య అన్నట్లు వందో సినిమాగా ఇలాంటి సినిమా తెరకెక్కడం దైవ సంకల్పమేనేమో.

సినిమా చూసేందుకు నందమూరి అభిమానులు మాత్రమే కాదు.. సామాన్య ప్రేక్షకులు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సినిమాలో విశేషాలకు కొదవలేదు. బాలయ్య పెర్ఫామెన్స్.. విజువల్స్.. వార్ సీన్స్.. ఇలా చాలా ఆకర్షణలే ఉన్నాయిందులో.

ఐతే వీటన్నింటినీ మించిన సర్ప్రైజ్ సినిమాలో ఉంటే చూడాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు. ఆ సర్ప్రైజ్ మరేదో కాదు.. బాలయ్య తనయుడు మోక్షజ్న తెరంగేట్రం. ఈ సినిమా మొదలైన సమయంలో మోక్షజ్న ఇందులో శాతకర్ణి కొడుకు పులోమావి పాత్రలో కనిపిస్తాడన్న వార్తలొచ్చాయి. కానీ తర్వాత దీని గురించి చర్చే లేదు.

డైరెక్టర్ క్రిష్ కానీ.. బాలయ్య కానీ ఎక్కడా దీని ప్రస్తావన తేలేదు. అంటే ఇందులో మోక్షజ్న క్యామియో రోల్ ఏమీ చేయట్లేదనా.. లేక సర్ప్రైజ్ లాగా ఆ విషయాన్ని దాచిపెట్టారా అన్నది క్లారిటీ లేదు. 2017లో తన కొడుకుని వెండితెరకు పరిచయం చేస్తానని మాటిచ్చాడు బాలయ్య.

ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే హీరోగా మోక్షజ్న సినిమా ఇప్పుడిప్పుడే మొదలై.. 2017లోనే రిలీజయ్యే అవకాశాలైతే కనిపించడం లేదు. మరి బాలయ్య మాట నిలబడాలంటే 'శాతకర్ణి' లో మోక్షజ్న కనిపించాలి. మరి ఇందులో బాలయ్య తన కొడుక్కి పాత్ర ఇచ్చి.. లాంఛనం పూర్తి చేయిస్తున్నట్లా లేదా అన్నది తేలాల్సి ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు