వంగవీటి సినిమా వస్తుంది.. దమ్ముంటే ఆపుకోండి

వంగవీటి సినిమా వస్తుంది.. దమ్ముంటే ఆపుకోండి

వంగవీటి సినిమాకు సంబంధించిన వివాదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. 'వంగవీటి' కథను వక్రీకరించి ఇష్టానుసారం తీశాడంటూ రామ్ గోపాల్ వర్మ పై రంగా తనయుడు రాధా విరుచుకుపడుతుండటం.. దానికి వర్మ కూడా దీటుగా బదులివ్వడం తెలిసిందే. ఈ క్రమంలో వర్మ నేను తీసింది తప్పయితే.. 'అసలైన వంగవీటి' పేరుతో ఇంకో సినిమా తీసుకోండి అంటూ సవాల్ విసిరాడు.

ఈ సవాల్‌ను స్వీకరించాడో ఏంటో కానీ.. ఫైట్ మాస్టర్‌గా.. విలన్‌గా సుపరిచితుడైన జీవీ అలియాస్ సుధాకర్ నాయుడు వంగవీటి మీద సినిమా తీస్తానంటూ సంచలన ప్రకటన చేశాడు. వచ్చే ఏడాది ఇదే సమయానికి వంగవీటికి సంబంధించి అసలైన చరిత్రతో.. ఆయన గొప్ప దనాన్ని తెలియజేసే సినిమా వస్తుందని వెల్లడిస్తూ.. దమ్ముంటే ఆపుకోండి అంటూ జీవీ సవాల్ విసరడం విశేషం. జీవీ ఇంతకుముందు దర్శకుడిగా శ్రీకాంత్‌తో 'రంగ ది దొంగ', నితిన్‌తో 'హీరో' సినిమాలు తీసిన సంగతి తెలిసిందే.

వర్మ కవ్వింపుల నేపథ్యంలో జీవీ నిజంగా సినిమా తీస్తే రంగా అభిమానుల నుంచి ఆర్థికంగా సహకారం కూడా లభించే అవకాశముంది. మరోవైపు జీవీ నుంచి ప్రకటన వచ్చిన అనంతరం కూడా వర్మ సెటైర్లు ఆపలేదు. వంగవీటి గురించి కేవలం నిజాలతో సినిమాలతో తీస్తే ఆస్కార్ అవార్డు కూడా అందుకునే అవకాశం ఉందంటూ ఎద్దేవా చేశాడు వర్మ. ఈ నేపథ్యంలో జీవీ అండ్ కో నిజంగా సినిమా తీస్తారా.. తీస్తే అది ఎలా ఉంటుందో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు