త‌మ‌న్నా.. దంగ‌ల్ మ‌ధ్య‌లోనే ఎందుకెళ్లిపోయింది?

త‌మ‌న్నా.. దంగ‌ల్ మ‌ధ్య‌లోనే ఎందుకెళ్లిపోయింది?

మ‌హిళా సాధికార‌త నేప‌థ్యంలో సాగే ఒక గొప్ప సినిమా చూస్తూ మ‌ధ్య‌లో లేచి వెళ్లిపోవాల్సి వ‌చ్చిందంటూ వాపోయింది స్టార్ హీరోయిన్ త‌మ‌న్నా. 'దంగ‌ల్' సినిమా చూస్తుండ‌గా ఆమె మ‌ధ్య‌లోనే థియేట‌ర్ నుంచి లేచి వెళ్లిపోయేలా చేశాడు త‌మిళ ద‌ర్శ‌కుడు సూరజ్.

హీరోయిన్ల‌న్నాక అందాల ప్ర‌ద‌ర్శ‌న చేయాల్సిందే అని.. ప్రేక్ష‌కులు థియేట‌ర్లు వ‌చ్చేది హీరోల ఫైట్లు.. హీరోయిన్ల అందాలు చూడ‌టానికే అంటూ సూర‌జ్ చేసిన వ్యాఖ్య‌లు పెద్ద దుమారాన్నే రేపాయి.  విశాల్-త‌మన్నా జంటగా న‌టించిన 'క‌త్తి సెండై' (ఒక్క‌డొచ్చాడు) సినిమాకు సూర‌జే ద‌ర్శ‌కుడు. అందులో త‌మ‌న్నా గ్లామ‌ర‌స్ రోల్ చేయ‌డంపై స్పందిస్తూ సూర‌జ్ ఈ వ్యాఖ్య‌లు చేశాడు.

ఈ వ్యాఖ్య‌ల‌పై ముందుగా న‌య‌న‌తార స్పందిస్తూ.. హీరోయిన్లు ఉన్న‌ది బ‌ట్ట‌లు విప్ప‌డానికి కాదంటూ ఘాటు విమ‌ర్శ‌లు చేసింది. ఆ త‌ర్వాత త‌మ‌న్నా లైన్లోకి వ‌చ్చింది. 'దంగ‌ల్' సినిమా చూస్తూ.. సూర‌జ్ కామెంట్ల సంగ‌తి తెలిసి మ‌ధ్య‌లోనే బ‌య‌టికి వ‌చ్చేశాన‌ని.. సూర‌జ్ త‌న వ్యాఖ్య‌ల‌పై త‌న‌కే కాక మొత్తం హీరోయిన్లంద‌రికీ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని ఆమె డిమాండ్ చేసింది.

హీరోయిన్లు వ‌స్తువులు కాద‌ని.. త‌మ‌కు అభ్యంత‌ర‌క‌రంగా లేని దుస్తులే వేసుకుంటార‌ని ఆమె పేర్కొంది. మ‌రోవైపు విశాల్ సైతం సూర‌జ్ వ్యాఖ్య‌ల్ని ఖండించాడు. హీరోయిన్లు ఉన్న‌ది టాలెంట్ చూపించ‌డానికే త‌ప్ప అందాల ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డానికి కాద‌ని అత‌న‌న్నాడు. త‌న వ్యాఖ్య‌ల‌పై తీవ్ర దుమారం రేగ‌డంతో సూర‌జ్ త‌మ‌న్నాతో పాటు హీరోయిన్లంద‌రికీ క్ష‌మాప‌ణ చెబుతూ స్టేట్మెంట్ ఇచ్చాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు