ధృవ షాకిచ్చేలా ఉందే..

ధృవ షాకిచ్చేలా ఉందే..

బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ‘ధృవ’ ప్ర‌యాణం భ‌లే ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. ఈ సినిమాకు వ‌చ్చిన టాక్‌కు.. తొలి రోజు వ‌చ్చిన వ‌సూళ్లు పొంత‌న కుద‌ర్లేదు. ఇంకా మెరుగైన వ‌సూళ్లు ఆశించారు కానీ.. తొలి రోజు ఓ మోస్త‌రు క‌లెక్ష‌న్లతో స‌రిపెట్టుకుందా సినిమా. ముఖ్యంగా యుఎస్ ప్రిమియ‌ర్ల క‌లెక్ష‌న్లు ‘బ్రూస్ లీ’ సినిమా వ‌సూళ్ల కంటే కూడా త‌క్కువగా ఉండ‌టంతో ఆందోళ‌న వ్య‌క్త‌మైంది. కానీ త‌ర్వాతి రోజుల్లో క‌లెక్ష‌న్లు స్ట‌డీగా ఉండ‌టంతో నిర్మాత అల్లు అర‌వింద్.. బ‌య్య‌ర్లు ఊపిరి పీల్చుకున్నారు. వీక్ డేస్‌లో వీక్ అయిన ఈ సినిమా.. రెండు, మూడు వీకెండ్ల‌లోనూ మంచి వ‌సూళ్లు సాధించిన ‘ధృవ’ రూ.50 కోట్ల షేర్ మార్కును కూడా దాటేయ‌డం విశేషమే.

ప్రిమియ‌ర్ వ‌సూళ్లు చూసి అమెరికాలో మిలియ‌న్ క్ల‌బ్బు అయినా ట‌చ్ చేస్తుందా అని సందేహాలు వ్య‌క్తం చేశారు కానీ అక్క‌డ ఐదో రోజుకే ఆ మార్కును దాటేసి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది ‘ధృవ‌. ఆ త‌ర్వాత వ‌సూళ్లు మ‌ళ్లీ డ్రాప్ అయ్యాయి. కానీ రెండో వీకెండ్లో వ‌చ్చిన చిన్న సినిమాల ప్ర‌భావం ఏమాత్రం లేక‌పోవ‌డంతో మ‌ళ్లీ ధృవ పుంజుకుంది. ఐతే లాస్ట్ వీకెండ్లో ఒకేసారి ఐదు సినిమాలు రిలీజ‌య్యాయి. ‘వంగ‌వీటి’ అమెరికాలోనూ కొంచెం భారీగానే రిలీజైంది. ‘పిట్ట‌గోడ‌’కు కూడా ఓ మోస్త‌రుగా స్క్రీన్లు ద‌క్కాయి. దీంతో ‘ధృవ’ ప‌నైపోయింద‌నుకున్నారు. కానీ.. ఆ రెండు సినిమాలు పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేక‌పోయాయి.

ఈ కొత్త సినిమాల కంటే మూడో వీకెండ్లో ఉన్న ‘ధృవ‌’కే అమెరికాలో ఎక్కువ వ‌సూళ్లు వ‌చ్చాయి. ప్ర‌స్తుతానికి ఈ సినిమా యుఎస్ వ‌సూళ్లు 1.36 మిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరుకున్నాయి. వ‌చ్చే వారం సినిమాలు ‘ధృవ‌’ను బీట్ చేయ‌లేక‌పోతే ఈ సినిమా 1.5 మిలియ‌న్ క్ల‌బ్బులోకి చేరి షాకిచ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English