కాజల్ వెర్సస్ సమంత.. ఎవరు గెలుస్తారు?

కాజల్ వెర్సస్ సమంత.. ఎవరు గెలుస్తారు?

తమిళ సూపర్ స్టార్ విజయ్‌కు టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కాజల్ అగర్వాల్, సమంతలతో మంచి ఈక్వేషన్ ఉంది. వాళ్లిద్దరూ అతడికి లక్కీ హీరోయిన్లు. కాజల్‌తో తుపాకి, జిల్లా లాంటి సూపర్ హిట్లు కొట్టాడు విజయ్. అలాగే సమంతతో కత్తి, తెరి లాంటి బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. అందుకే తన తర్వాతి సినిమాకు ఈ ఇద్దరు లక్కీ హీరోయిన్లలో ఒకరిని ఎంచుకోవాలని భావిస్తున్నాడు.

ఐతే వీళ్లిద్దరితో తనకు మంచి హిట్లే ఉన్నప్పటికీ.. ప్రస్తుతం వాళ్లిద్దరి కెరీర్ ఏమంత ఊపులో లేదు. సమంత సినిమాలు దాదాపుగా మానేసి వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. మరోవైపు కాజల్.. ఫ్లాపుల్లో వరుసగా డబుల్ హ్యాట్రిక్ కొట్టేసింది. ఐతే విజయ్ మాత్రం ఈ ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవాలనే ఫిక్సయ్యాడట.

ప్రస్తుతం సీనియర్ డైరెక్టర్ భరతన్ దర్శకత్వంలో 'భైరవ' సినిమాను పూర్తి చేశాడు విజయ్. అతడికిది 60వ సినిమా కావడం విశేషం. ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దీని తర్వాత తనకు 'తెరి' లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన అట్లీ దర్శకత్వంలోనే సినిమా చేయనున్నాడు విజయ్.

ఈ చిత్రానికి మన స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్టు సమకూరుస్తుండటం విశేషం. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నందించే అవకాశాలున్నాయి. వచ్చే నెలలోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశముంది. మరి జనవరి నెలాఖర్లోనే ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్న సమంత ఈ సినిమాకు హీరోయిన్ ఆఫర్ ఇస్తే ఒప్పుకుంటుందో లేదో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు