సమంత... బ్యాక్‌ బ్యూటీ

సమంత... బ్యాక్‌ బ్యూటీ

దక్షిణాదిలో కుర్రాళ్ల గుండెలను మెలి తిప్పేసి ఇప్పుడు అక్కేనేని నాగార్జున ఇంటికి కోడలుగా వెళ్లనున్న సొట్టబుగ్గల సుందరి సమంత పెళ్లికి ముందే ఫుల్ గా ఎంజాయ్ చేద్దామని డిసైడైనట్లుంది. కాబోయే భర్త చైతూతో కలిసి టూర్లు తిరుగుతున్నట్లు టాక్. చైతూ, సమంతల నిశ్చితార్థం డేట్‌ కూడా ఫిక్స్ అయిపోవడంతో ఇద్దరూ చెట్టపట్టాలేసుకుంటున్నారట.  వచ్చే ఏడాది జనవరి 29న నిశ్చితార్థ వేడుక నిర్వహించనుండగా ఈలోగా ఈ కుర్ర జంట విహార యాత్రల్లో సరదాగా గడిపేస్తున్నారట.

నిన్న క్రిస్మస్ సందర్భంగా అభిమానులకు సమంత తనదైన స్టైల్‌లో శుభాకాంక్షలు చెప్పారు. తాను సముద్రంలాంటి దానినంటూ కొన్ని స్టిల్స్‌ పోస్టు చేసింది. సముద్రంలోకి దిగి తన బ్యాక్‌ బ్యూటీని చూపిస్తూ దిగిన ఫొటోలను పోస్టు చేసి… తనకు సముద్రానికి ఉన్న లక్షణాలు కొన్ని ఉన్నాయని చెప్పింది. అందం, అంతుచిక్కని రహస్యాలు, సువిశాలమైన తత్వం, స్వేచ్చ ఇవన్నీ సముద్రంలాగే తనకు ఉన్నాయని ట్వీట్ చేసింది సమంత.

కాగా... నాగచైతన్య, కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పనుల్లో బిజీగా ఉండగా సమంత మాత్రం సినిమాలకు దూరంగా ఉంటోంది. రెండు తమిళ సినిమాలు అంగీకరించిందన్న టాక్ వచ్చింది. అయితే షూటింగ్‌లకు మాత్రం సమంత వెళ్లడం లేదని చెబుతున్నారు. షూటింగ్ లకు వెళ్లకుండా ఇలా.. విహార యాత్రలతో ఎంజాయ్ చేస్తోందన్నమాట.

In Pics: Samantha With Nag Family

  • Samantha Spotted With Nag Family
  • Samantha Spotted With Nag Family
  • Samantha Spotted With Nag Family
  • Samantha Spotted With Nag Family

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు