తొలి రోజు 30 కోట్లు.. రెండో రోజు 35 కోట్లు

తొలి రోజు 30 కోట్లు.. రెండో రోజు 35 కోట్లు

పెద్ద సినిమాలకు ఎంత మంచి టాక్ వచ్చినా సరే.. తొలి రోజు వసూళ్లతో పోలిస్తే.. రెండో రోజు తక్కువగా ఉంటాయి. తొలి రోజు సాధ్యమైనన్ని ఎక్కువ థియేటర్లలో సినిమాను రిలీజ్ చేస్తారు. పైగా అదనపు షోలు కూడా ఉంటాయి. కానీ రెండో రోజుకు థియేటర్లు తగ్గుతాయి. అదనపు షోలు కూడా ఉండవు. అందుకే తొలి రోజుతో సమానంగా.. లేదా ఆ ఫిగర్‌కు దగ్గరగా రెండో రోజు వసూళ్లు వస్తేనే ఆ సినిమా ప్రేక్షకులకు అమితంగా నచ్చేసిందని అర్థం. అది బ్లాక్ బస్టర్ అని ఫిక్సయిపోతారు. ఐతే తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు వసూళ్లు ఎక్కువగా ఉంటే ఆ సినిమాను ఏమనాలి? 'అమీర్ సినిమా' అనాలేమో. కేవలం అమీర్ ఖాన్ సినిమాలకు మాత్రమే ఇలా జరుగుతుంటుంది.

అమీర్ చివరి సినిమా 'పీకే'కు ఇలాగే జరిగింది. తొలి రోజుతో పోలిస్తే.. రెండో రోజు వసూళ్లు పెరిగాయి. ఇప్పుడు 'దంగల్' కూడా అదే బాటలో నడుస్తోంది. ఈ సినిమా డొమెస్టిక్ కలెక్షన్స్ తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు ఎక్కువున్నాయి. తొలి రోజు దాదాపు రూ.30 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. రెండో రోజు ఏకంగా రూ.35 కోట్లు కొల్లగొట్టి ట్రేడ్ పండిట్లను ఆశ్చర్యపరిచింది.

అంటే రెండు రోజులకే 'దంగల్' ఇండియా వసూళ్లు రూ.65 కోట్లకు చేరుకున్నాయి. విశేషం ఏంటంటే.. 'దంగల్' దేశీయ వసూళ్ల కంటే కూడా విదేశీ వసూళ్లు ఎక్కువగా ఉన్నాయి. విదేశాల్లో శనివారం వరకు ఆ చిత్రం రూ.66 కోట్లు వసూలు చేయడం విశేషం. ఇందులో ఇంకా కొన్ని దేశాల వసూళ్లను కలపాల్సి ఉందట. వీకెండ్ ముగిసేసరికి ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.150 కోట్లకు పైనే కొల్లగొడుతుందని భావిస్తున్నారు. వీకెండ్ తర్వాత కూడా కలెక్షన్లలో మేజర్ డ్రాప్ ఉండదని అంచనా వేస్తున్నారు.

Pics: Aamir, Fatima At Dangal Pressmeet

  • Aamir Khan, Fatima At Dangal Pressmeet
  • Aamir Khan, Fatima At Dangal Pressmeet
  • Aamir Khan, Fatima At Dangal Pressmeet
  • Aamir Khan, Fatima At Dangal Pressmeet
  • Aamir Khan, Fatima At Dangal Pressmeet
  • Aamir Khan, Fatima At Dangal Pressmeet 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు