గౌతమ్ మీనన్.. మళ్లీ అదే టైపు సినిమా

గౌతమ్ మీనన్.. మళ్లీ అదే టైపు సినిమా

గౌతమ్ మీనన్ సినిమాలు ఎంత విలక్షణంగా ఉంటాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి సినిమాలోనూ అతడిదంటూ ఓ ముద్ర కనిపిస్తుంది. సున్నితమైన ప్రేమకథల్ని ఎంత హృద్యంగా తీస్తాడో.. యాక్షన్ కథల్ని అంత ఇంటెన్సిటీతో తెరకెక్కిస్తాడు. ఈ మధ్యే 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు గౌతమ్. ఈ సినిమా తెలుగులో ప్రేక్షకుల అంచనాల్ని అందుకోలేకపోయింది. ఐతే తమిళంలో మాత్రం బాగా ఆడేసింది. ఇప్పుడు ధనుష్ హీరోగా 'ఎన్నై నొక్కి పాయుమ్ తోటా' అనే సినిమాను తెరకెక్కించాడు గౌతమ్. దీని టీజర్ తాజాగా రిలీజైంది.

నిమిషం నిడివితో.. ధనుష్ వాయిస్ ఓవర్‌తో సాగే టీజర్ ఆసక్తికరంగా ఉంది. తాను ప్రేమించిన అమ్మాయి ప్రాణాపాయంలో ఉంటే ఆమె కోసం రంగంలోకి దిగి.. తన సమస్యను తీర్చే హీరో కథ ఇది. టీజర్ అంతా చూస్తే.. 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమానే మళ్లీ చూబోతున్నట్లుగా ఉంది. అందులో కూడా హీరోయిన్ సమస్యలో ఉంటే.. హీరో ఆమెను రక్షించడానికి రంగంలోకి దిగుతాడు. గౌతమ్ మీనన్ గత సినిమాలన్నీ పరిశీలిస్తే.. ప్రేమకథలన్నీ ఒకే తరహాలో కనిపిస్తాయి. అలాగే పోలీస్ యాక్షన్ కథలు కూడా అదే తరహాలో ఉంటాయి.

ఒక టైం పీరియడ్లో ఒకే రకం సినిమాలు తీసి.. ఆ తర్వాత రూటు మార్చడం గౌతమ్‌కు అలవాటు. ప్రస్తుతం అతను లవ్-యాక్షన్ కలగలిపి సినిమాలు తీసే మూడ్లో ఉన్నట్లున్నాడు. ఈ సినిమా ప్రేమికుల దినోత్సవ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click Here For The Teaser

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు