వంగవీటిలో ఆ డైలాగ్ తీసేశారు

వంగవీటిలో  ఆ డైలాగ్ తీసేశారు

రాంగోపాల్ వర్మ తాజా చిత్రం వంగవీటి. ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పటిని నుంచి విడుదలయ్యే వరకూ ఎంతోఉత్కంట వ్యక్తమైంది. అసలీ సినిమాను వర్మ ఎలా తెరకెక్కిస్తాడని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. సినిమా విడుదలయ్యాక వచ్చే సమీక్షల్ని కాసేపు వదిలేస్తే.. ఈ సినిమా తీయాలన్న ఆలోచన రావటానికే చాలా దమ్ము కావాలి. రెండంచుల కత్తి మీద నడక అన్నది సామాన్యమైన విషయం కాదు. లెక్క తేడా వస్తే అంతే సంగతులు.

అలాంటి పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలో వర్మకు బాగానే తెలుసు. వంగవీటి సినిమా విడుదలయ్యాక.. ఆ సినిమాలోని కొన్ని అంశాల మీద వంగవీటి మోహన్ రంగా కుమారుడు వంగవీటి రాధా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన డీజీపీ వర్మతో మాట్లాడారు.

డీజీపీ మాటల ఎఫెక్టో.. లేక.. వంగవీటి రాధా అడిగిన డిమాండ్ లో సమంజసం ఉందని ఫీలయ్యారో కానీ.. తాజాగా సినిమాలోని ఒక డైలాగ్ ను కట్ చేసేందుకు ఒప్పుకున్నరు వర్మ. సినిమాలో భాగంగా రత్నకుమారి.. వంగవీటి రంగాతో ‘‘చంపేయ్ రంగా’’ అనే డైలాగ్ ను కట్ చేసేందుకు వర్మ ఓకే చేసేశారు. సో.. ఈ రోజు నుంచి సినిమాలో ఆ డైలాగ్ ఉండనట్లే. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు