'సప్తగిరి' బాగానే లాగేశాడంట

'సప్తగిరి' బాగానే లాగేశాడంట

వంగవీటి లాంటి ఆర్జీవి ఓ వైపు.. మరోవైపు మిష్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ 'దంగల్' మరో వైపు ఈ రెండింటి మధ్య 'సప్తగిరి ఎక్స్ ప్రెస్' నలిగిపోవడం ఖాయం అనుకున్నారంతా. అంతెందుకు అసలు స్క్రీన్లే దొరకవని అనుకున్నారు.

కానీ.. అనూహ్యంగా 300 స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ అయింది. దాంతో ఇక సప్తగిరి ఎక్స్ ప్రెస్ సేఫ్ జోన్ లోకి వెళ్లడం ఖాయం అనుకున్నారు నిర్మాత. తాను ఖర్చు పెట్టిన రూ.6కోట్లు ఎలాగైనా రాబట్టొచ్చులే అనుకుని వుండొచ్చు అన్ని స్క్రీన్లు దొరకగానే. అయితే సినిమా విడుదలైన తరువాత బ్యాడ్ టాక్ రావడంతో ఇక సప్తగిరి ఎక్స్ ప్రెస్ బోల్తాకొట్టినట్టే అనుకున్నారంతా.

అయితే తొలిరోజు మాత్రం రెండు పెద్ద సినిమాలు వున్నా.. సప్తగిరి బాగానే రాబట్టగలిగాడు. సుమారు రూ.2.35 కోట్ల గ్రాస్ ను రాబట్టగలిగాడని నిర్మాత ప్రకటించాడు. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే మరో రెండు రోజులు పోతేగానీ అసలు విషయం బయటకు రాదు. కేవలం హైప్ కోసమే నిర్మాత మంచి ఓపెనింగ్స్ వచ్చాయంటూ లేని కలెక్షన్లను అనౌన్స్ చేశాడా లేదా అనేది తెలియాలంటే.. మరో రెండ్రోజులూ ఆగాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు