వంగవీటిపై వివాదాల హోరు

వంగవీటిపై వివాదాల హోరు

వివాదాస్పద డైరక్టర్ రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన వంగవీటి మూవీపై వివాదం చల్లారడం లేదు. మూవీ షూటింగ్ దశలోనే ఉండగానే కావల్సినంత న్యూసెన్స్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. ఇప్పుడు రిలీజైన తర్వాత పోలీస్ కంప్లైంట్ వరకూ వెళ్లింది. విజయవాడలో కూడా వంగవీటి అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

వంగవీటి మూవీలో ఉద్దేశపూర్వకంగా కొన్ని సీన్లు తప్పుగా చూపించారని వంగవీటి రంగా కుమారుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. సినిమా తీసే ముందు వర్మ తనను కలిశారని, అయితే తాము చెప్పిన అభ్యంతరాలను లైట్ తీసుకున్నారని కంప్లైంట్ చేశారు.

బెజవాడలో మూడు దశాబ్దాల క్రితం జరిగిన గ్యాంగ్ వార్ ఆధారంగా తెరకెక్కిన వంగవీటిలో.. వంగవీటి, దేవినేని వర్గాల మధ్య వార్ చిత్రీకరించారు. అయితే ఏ సీన్ నూ వాస్తవికంగా తీయలేదని ఏదో డ్రమటిగ్గా తీసుకుంటూ పోయారనేది ఆరోపణ. ముఖ్యంగా వంగవీటి క్యారెక్టర్ ను తక్కువ చేశారని రంగా అభిమానులు ఫైరౌతున్నారు.

అన్ని పాత్రలను అప్పటి కాలం, నేపథ్యం, వాస్తవాలకు అనుగుణంగా తీయకుండా.. పాత్రల ఔచిత్యాన్ని మారిస్తే.. రియల్ స్టోరీ ఎలా అవుతుందని రంగా అభిమానులు ప్రశ్నిస్తున్నారు. డబ్బుల కోసం, కొంతమంది ప్రాపకం కోసం వర్మ సినిమా తీసినట్లుందని మార్నింగ్ షో తర్వాత ఆడియన్స్ రిపోర్ట్. ఇప్పుడు వంగవీటి రాధా డీజీపీకి ఫిర్యాదు చేయడంతో.. వాట్ నెక్స్ట్ అనేది ఆసక్తికరంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు