మణిరత్నం చెప్పాకే చరణ్‌ మారాడట

మణిరత్నం చెప్పాకే చరణ్‌ మారాడట

‘మగధీర’ లాంటి పీరియడ్ మూవీ తర్వాత.. ‘ఆరెంజ్’ లాంటి డిఫరెంట్ మూవీ చేశాడు చరణ్. కానీ ఆ సినిమాకు దారుణమైన ఫలితం వచ్చింది. దెబ్బకు మళ్లీ కొత్త కథల జోలికి వెళ్లలేదు. వరుసగా రొటీన్ మాస్ మసాలా సినిమాలే చేస్తూ వచ్చాడు. కానీ ఓ దశ దాటాక అవీ దెబ్బ తీశాయి. దీంతో ఇప్పుడు మళ్లీ రూటు మార్చి ‘ధృవ’ లాంటి వైవిధ్యమైన సినిమా చేశాడు.

మంచి ఫలితాన్నందుకున్నాడు. ఐతే తనలో ఈ మార్పుకు కారణం లెజెండరీ డైరెక్టర్ మణిరత్నమే అన్నాడు చరణ్. ఆయన చెప్పడం వల్లే కొత్త కథలపై ఫోకస్ పెట్టానని.. అందులో భాగంగానే ‘ధృవ’ చేశానని చరణ్ చెప్పడం విశేషం. ‘ధృవ’ టీం ఏర్పాటు చేసిన ‘సెల్యూట్ టు ఆడియన్స్’ కార్యక్రమంలో చరణ్ ఈ సంగతి వెల్లడించాడు.

‘‘ఓసారి మణిరత్నం గారిని కలిసినపుడు.. కొత్త కథలు కూడా వింటూ ఉండమని చెప్పారు. ఆ మాట నా మనసులో విత్తనం లాగా పడింది. అప్పట్నుంచి కొత్త కథలు వింటూ వస్తున్నా. ‘ధృవ’ ఒప్పుకోవడానికి మణిరత్నం గారి మాటలే స్ఫూర్తి. నెంబర్ల గురించి.. రికార్డుల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఇలాంటి వైవిధ్యమైన కథలు ఎంచుకోలేం. నాకు వాటి మీద పట్టింపు లేదు’’ అని చరణ్ అన్నాడు.

తన మావయ్య అల్లు అరవింద్‌తో ‘మగధీర’ తర్వాత మంచి సినిమా చేయాలని నాలుగేళ్లుగా అనుకుంటుంటే ఇప్పటికి కుదిరిందని.. అలాగే సురేందర్ రెడ్డితో పని చేయాలన్న కోరిక కూడా ఇప్పుడే తీరిందని చరణ్ అన్నాడు. తన మావయ్యతో సినిమా చేస్తే తన తల్లి ఎంతో సంతోషిస్తుందని చరణ్ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English