సంపూ అంటే ముమైత్‌కు అంత పిచ్చా?

సంపూ అంటే ముమైత్‌కు అంత పిచ్చా?

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబుకు ఒక పెద్ద వీరాభిమాని దొరికేసింది. ఐటెం పాటలతో తెలుగు సినిమాల్ని ఒక ఊపు ఊపేసిన ముమైత్ ఖాన్‌కు సంపూ అంటే చచ్చేంత ఇష్టమట. అతణ్ని కలవబోతున్నందుకు.. కలిసినందుకు తెగ ఆనందపడిపోతూ ఆమె ట్విట్టర్లో చాలా ఎమోషనల్ అయిపోయింది. గురువారం జెమిని టీవీ అవార్డుల కార్యక్రమానికి సంపూతో పాటు ముమైత్ కూడా హాజరైంది. ఐతే సంపూను కలవడానికి ముందే.. అతణ్ని కలవబోతున్నందుకు చాలా ఆనందగా ఉందని.. ఈ విషయంలో తాను చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నానని ట్విట్టర్లో మెసేజ్ పెట్టింది ముమైత్. ఇక సంపూను కలిసి సెల్ఫీ దిగాక ఆమె ఆనందం మామూలుగా లేదు.

‘‘సంపూ నువ్వు నాకో సూపర్ స్టార్.. యూ ట్యూబ్‌లో నీ వీడియోలు చాలా చూశా. ఎంతోమంది ఇంటర్నేషనల్ యూట్యూబ్ వ్యూయర్స్ నీ గురించి.. నీ కామెడీ సీన్ల గురించి రివ్యూలు ఇస్తుంటారు. నేను అనారోగ్యంతో ఉన్నపుడు దాన్నుంచి కోలుకోవడానికి నీ కామెడీ ద్వారా నవ్విస్తూ ఎంతో సాయం చేశావు. నిన్ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అంటూ ట్విట్టర్లో చాలా ఎమోషనల్‌గా మెసేజ్ పెట్టింది ముమైత్. ఆమె చూపించిన అభిమానానికి ఉబ్బితబ్బిబ్బయిపోయిన సంపూ.. స్పందించడానికి తనకు మాటలు రావట్లేదు అనేశాడు. ఐతే ఈ సంభాషణ అంతా చూశాక.. ఇది నిజ్జంగా నిజమేనా.. లేక కామెడీనా అన్న డౌట్లు కొట్టేశాయ్ జనాలకు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు